128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో క్రికెట్ ఎంట్రీ..!

by Mahesh |   ( Updated:2023-10-10 05:56:48.0  )
128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో క్రికెట్ ఎంట్రీ..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన క్రీడల్లో క్రికెట్ ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా జరిగే ఆసియా గేమ్స్, ఒలింపిక్స్ లో మాత్రం క్రికెట్ కు ఎంట్రీ లేదు. కానీ 2022 19 వ ఆసియా క్రీడల్లో క్రికెట్ కు అధికారికంగా ఎంట్రీ దక్కగా, మెన్స్, ఉమెన్స్ రెండు విభాగాల్లో భారత్ గోల్డ్ మెడల్స్ సాధించింది. కాగా 2028 ఒలింపిక్స్ లాస్ ఏంజిల్స్ లో నిర్వహించనున్నారు. ఈ క్రమంలో లాస్ ఏంజిల్స్ ఆర్గనైజింగ్ కమిటీ, IOCకి చేసిన ప్రతిపాదనలో T20 క్రికెట్‌తో పాటు మరో నాలుగు క్రీడలను సిఫార్సు చేసినట్లు సోమవారం ప్రకటించింది. దీనినే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కూడా ధృవీకరించింది. మరి ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ కలిగి క్రికెట్ ఈ సారి ఒలింపిక్స్ ఎంట్రి దక్కుతుందో లేదో తెలియాలంటే.. IOC నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed