Cricket: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు భారీగా నిధులు కేటాయించిన ICC.. ఎంతంటే..?

by Maddikunta Saikiran |
Cricket: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు  భారీగా నిధులు కేటాయించిన ICC.. ఎంతంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: వచ్చే ఏడాది పాకిస్థాన్ దేశంలో ICC ఛాంపియన్స్ ట్రోఫీ జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. టోర్నీ నిర్వహణ కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) భారీ బడ్జెట్ ప్రకటించింది. ఏకంగా రూ. 500 కోట్లను పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు కేటాయించింది. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు రూ.500 కోట్లు అవసరం అవుతాయని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB), ఐసీసీకి ప్రతిపాదన పంపగా, తాజాగా ఐసీసీ ఆ ప్రతిపాదనకు 'ఒకే' చెప్పింది.

ఈ క్రమంలో..PCB పంపిన ప్రతిపాదనపై ఈ రోజు జై షా నేతృత్వంలో ఐసీసీ ఫైనాన్షియల్ కమిటీ అధ్యయనం చేసి , ఈ మెగా టోర్నీ కోసం భారీ మొత్తాన్ని కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. కాగా.. ఈ టోర్నీలో ఇండియా పాల్గొనడంపై అనిశ్చితి నెలకొంది. భద్రత పరమైన కారణాల దృష్ట్యా ఇండియా టీంను పాకిస్తానుకు పంపబోమని బీసీసీఐ (BCCI) అనుకుంటున్నట్లు సమాచారం.

Next Story

Most Viewed