WTA Final 2024 : డబ్ల్యూటీఏ ఛాంపియన్‌గా కొకో గాఫ్.. ప్రైజ్ మనీ ఎంతో తెలిస్తే షాకే..!

by Sathputhe Rajesh |   ( Updated:2024-11-10 12:32:47.0  )
WTA Final 2024 : డబ్ల్యూటీఏ ఛాంపియన్‌గా కొకో గాఫ్.. ప్రైజ్ మనీ ఎంతో తెలిస్తే షాకే..!
X

దిశ, స్పోర్ట్స్ : అమెరికా టెన్నిస్ సంచలనం కొకో గాఫ్ డబ్ల్యూటీఏ ఛాంపియన్‌గా నిలిచింది. ఆదివారం సౌదీ అరేబియాలో జరిగిన డబ్ల్యూటీఏ ఫైనల్ మ్యాచ్‌లో కొకో గాఫ్ ఒలింపిక్స్ ఛాంపియన్ జెంగ్ క్విన్వెన్‌ను 3-6, 6-4, 7-6 తేడాతో ఓడించి తొలిసారిగా డబ్ల్యూటీఏ ఫైనల్ టైటిల్ సొంతం చేసుకుంది. మారియా షరపోవా తర్వాత డబ్ల్యూటీఏ టైటిల్ సొంతం చేసుకున్న యంగెస్ట్ ప్లేయర్‌గా 20 ఏళ్ల కొకో గాఫ్ నిలిచింది. సౌదీ అరేబియాలో జరిగిన తొలి డబ్ల్యూటీఏ టోర్నీ ఇదే. రెండు దశాబ్ధాల క్రితం మారియా షరపోవా ఈ ఫీట్ సాధించింది. అయితే 2001లో సెరెనా విలియమ్స్ తర్వాత టైటిల్ గెలిచిన యువ అమెరికా క్రీడాకారిణిగా గాఫ్ నిలిచింది. ట్రోఫీతో పాటు రూ.40 కోట్లు కొకో గాఫ్ అందుకోనుంది. గాఫ్ ఈ టోర్నీలో వరల్డ్ టాప్ 2 ప్లేయర్స్ అరినా సబలెంకా, ఇగా స్వియాటెక్‌లను చిత్తు చేసింది. అయితే ఈ టోర్నీలో గెలవడం ద్వారా వచ్చే ప్రైజ్ మనీ గురించి ఈ టెన్నిస్ క్రీడాకారిణికి తెలియదు. మ్యాచ్ అనంతరం ఓ రిపోర్టర్ ప్రైజ్ మనీ గురించి చెప్పగా గాఫ్ నవ్వింది. ఈ ఏడాదిలో ఇంత పెద్ద మొత్తంలో (4.8 మిలియన్ డాలర్స్) అందుకునే మహిళా ప్లేయర్, అథ్లెట్ తానే అయి ఉండవచ్చని తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed