రిఫరీని చెంప దెబ్బ కొట్టిన కోచ్.. వీడియో వైరల్‌

by Vinod kumar |
రిఫరీని చెంప దెబ్బ కొట్టిన కోచ్.. వీడియో వైరల్‌
X

బీజింగ్: చైనా లీగ్ వన్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో దిగ్భ్రాంతికర సంఘటన జరిగింది. ఓ మ్యాచ్ సందర్భంగా చైనా సాకర్ జట్టు కోచ్ జిన్ డువాన్ మ్యాచ్ రిఫరీ చెన్ హావోను చెంప దెబ్బ కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో సర్వత్రా విమర్శలొచ్చాయి. దీంతో కోచ్ జిన్ డివాన్ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. మ్యాచ్ మొదటి అర్ధభాగంలో డువాన్ జట్టుపై ప్రత్యర్థి జట్టు అయిన నాన్జింగ్ సిటీ ఆటగాళ్లకు మ్యాచ్ రిఫరీ పెనాల్టీ ఇచ్చాడు. దీంతో కోచ్ డివాన్ రిఫరీతో వాగ్వాదానికి దిగాడు. టచ్ లైన్ నుంచి తీవ్ర నిరసన వ్యక్తం చేసిన డువాన్‌కు రిఫరీ రెడ్ కార్డ్ చూపించాడు.

దీంతో కోపం నషాలానికి అంటిన డువాన్ ఏకంగా రిఫరీ పైకి దూసుకెళ్లి చెంప దెబ్బ కొట్టాడు. చైనా మీడియా నుంచి తీవ్ర విమర్శలు రావడంతో డువాన్ స్పృహ కోల్పోయాడని వార్తలొచ్చాయి. అతడిని ఆస్పత్రికి తరలించారు. స్పృహ నుంచి కోలుకున్న తర్వాత డువాన్ తన చర్యలకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ రిఫరీకి క్షమాపణలు చెప్పాడు. ఈ మ్యాచ్‌లో నాన్జింగ్ సిటీ జట్టు 4-0 గోల్స్‌తో డువాన్ జట్టును చిత్తు చేసింది.

Advertisement

Next Story