ICC Rankings: చరిత్ర సృష్టించిన శ్రీలంక కెప్టెన్‌.. తొలి ప్లేయర్‌గా..

by Vinod kumar |
ICC Rankings: చరిత్ర సృష్టించిన శ్రీలంక కెప్టెన్‌.. తొలి ప్లేయర్‌గా..
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీలంక మహిళల జట్టు కెప్టెన్‌ చమారీ ఆటపట్టు హిస్టరీ క్రియేట్ చేసింది. ఐసీసీ ఉమన్స్‌ వన్డే ప్లేయర్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన మొదటి శ్రీలంక క్రికెటర్‌గా ఆటపట్టు రికార్డులకెక్కింది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో 758 పాయింట్లతో ఆటపట్టు టాప్‌ ర్యాంక్‌కు చేరుకుంది. ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌ బెత్‌ మూనీ(758)ను వెనుక్కి నెట్టింది. స్వదేశంలో న్యూజిలాండ్‌ మహిళల జట్టుతో జరిగిన వన్డే సిరీస్‌లో అటపట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. మూడు మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలతో చెలరేగింది. ఓవరాల్‌గా ఈ సిరీస్‌లో 248 పరుగులు అటపట్టు సాధించింది. తన కెరీర్‌లో తొలిసారి నెం1 ర్యాంక్‌ను సొంతం చేసుకుంది.

ఇక ఓవరాల్‌గా శ్రీలంక మెన్స్‌, ఉమెన్స్‌ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్‌గా ఆటపట్టు నిలిచింది. ఇప్పటివరకు శ్రీలంక క్రికెట్‌ దిగ్గజం సనత్ జయసూర్య వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌ ర్యాంక్‌ సాధించాడు. ఆ తర్వాత ఏ ఒక్క శ్రీలంక క్రికెటర్‌(మెన్స్‌ అండ్‌ ఉమన్స్‌) టాప్‌ ర్యాంక్‌ను సాధించలేకపోయారు. తాజాగా అటపట్టు 20 ఏళ్ల తర్వాత అగ్రస్థానానికి చేరుకుని రికార్డులకెక్కింది.

Advertisement

Next Story

Most Viewed