- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPL: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. సీజన్ మొత్తానికి స్టార్ ప్లేయర్ దూరం!
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరం కానున్నట్లు సమాచారం. గత ఏడాది వెన్ను నొప్పి గాయం కారణంగా క్రికెట్‌కు దూరమైన బుమ్రా.. గాయం తీవ్రత తగ్గకపోవడంతో అప్పటినుండి అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగానే ఉంటున్నాడు. గాయం నుండి బుమ్రా ఇంకా పూర్తిగా కోలుకోలేదని.. అతడు పూర్తిగా రికవర్ అవ్వడానికి మరో ఏడెనిమిది నెలలు పట్టే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.
దీంతో ఈ ఏడాది మార్చి చివర్లో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16కు బుమ్రా పూర్తిగా దూరం కానున్నాడని తెలుస్తోంది. భవిష్యత్‌లో టీమిండియాకు మేజర్ లీగ్స్ ఉండటంతో అతడిని ఈ ఐపీఎల్ సీజన్‌కు దూరం పెట్టాలని బీసీసీఐ యోచిస్తోంది. ఇదే కనుక జరిగితే ఐపీఎల్ ముంబై ఇండియన్స్‌కు భారీ ఎదురుదెబ్బే అని చెప్పవచ్చు. ముంబై పేస్ దళానికి నాయకత్వం వహిస్తోన్న స్టార్ బౌలర్ బుమ్రా దూరం అయితే.. ఆ జట్టు విజయాలపై ప్రభావం చూపుతోంది అనడంలో ఎలాంటి సందేహాం లేదు.
ఎన్నో మ్యాచుల్లో ఒంటి చేత్తో ముంబైని గెలిపించిన బుమ్రా.. ముంబై జట్టు ఐపీఎల్‌లో ఐదు సార్లు టైటిల్ గెలవడంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా ఈ ఏడాది జూన్ నెలలో జరిగే టెస్ట్ ఛాంపియన్ ఫైనల్‌కు సైతం బుమ్రా అందుబాటులో ఉండకపోచ్చని సమాచారం. ఇదిలా ఉంటే, బుమ్రాపై నెటిజన్లు కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. బుమ్రా ఇండియా కోసం ఆడడని.. అతడు కేవలం ఐపీఎల్ ప్లేయర్ అని విమర్శలు చేస్తున్నారు.