బౌలింగ్ ప్రాక్టీస్‌కు సిద్దమైన బుమ్రా..?

by Mahesh |   ( Updated:2023-05-27 14:27:21.0  )
బౌలింగ్ ప్రాక్టీస్‌కు సిద్దమైన బుమ్రా..?
X

దిశ, వెబ్‌డెస్క్: భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వెన్నెముక గాయం కారణంగా చాలా మ్యాచులకు దూరమయ్యాడు. అలాగే వెన్నెముక శస్త్రచికిత్స చేసుకోవడంతో ఐపీఎల్ మొత్తానికి దూరం అయ్యారు. అలాగే.. ప్రపంచ టెస్ట్ చాంపియర్ షిప్‌కు కూడా దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో బుమ్రా తాజాగా తన ఇన్ స్టా్గ్రామ్‌లో పెట్టిన పోస్ట్ తన అభిమానుల్లో అనందాన్ని నిప్పింది. శస్త్రచికిత్స అనంతరం పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకుంటున్న బుమ్రా.. తన బౌలింగ్ స్పైక్‌ ఫొటోలను పంచుకున్నాడు. దానికి ఇలా రాశాడు. "హలో మిత్రమా, మనం మళ్ళీ కలుద్దాం" అని రాశాడు దీంతో బుమ్రా బౌలింగ్ ప్రాక్టీస్ చేయడానికి సిద్ధం అయినట్లు సంకేతాలు ఇచ్చారు. దీంతో బుమ్రా త్వరగా కోలుకుని వన్డే వరల్డ్ కప్‌కు అందుబాటులోకి రావాలని భారత క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.

Also Read..

WTC ఫైనల్: నేడు లండన్‌‌ వెళ్లనున్న కెప్టెన్ రోహిత్

డబ్ల్యూటీసీకి ముందు భారత్‌కు ఎదురుదెబ్బ

Advertisement

Next Story

Most Viewed