Sanjay Dutt : సంజయ్ దత్ న్యూ జర్నీ.. క్రికెట్‌ ఫ్రాంచైజీ కొనుగోలు

by Vinod kumar |   ( Updated:2023-06-22 11:14:06.0  )
Sanjay Dutt : సంజయ్ దత్ న్యూ జర్నీ.. క్రికెట్‌ ఫ్రాంచైజీ కొనుగోలు
X

దిశ, వెబ్‌డెస్క్: జింబాబ్వే ఓ టీ20 లీగ్‌ను నిర్వహించేందుకు సిద్దమైంది. ఈ లీగ్‌కు జింబాబ్వే క్రికెట్‌ 'జిమ్ ఆఫ్రో టీ10' అని నామకారణం చేసింది. ఈ లీగ్‌ జూలై 20న ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో మొత్తం ఐదు జట్లు భాగం కానున్నాయి. డర్బన్ క్వాలండర్స్, కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ, బులవాయో బ్రేవ్స్, జోబర్గ్ లయన్స్‌, హరారే హరికేన్స్ ఫ్రాంచైజీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ నటుడు సంజయ్ దత్.. హరారే హరికేన్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేశాడు. ఏరీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ సర్ సోహన్ రాయ్‌తో కలిసి హరారే ఫ్రాంచైజీని సంజయ్‌ దత్‌ సొంతం చేసుకున్నాడు. ఈ విషయాన్ని సంజయ్‌ దత్‌ కూడా దృవీకరించాడు.

Advertisement

Next Story

Most Viewed