పారిస్ ఒలింపిక్స్‌కు బీజేపీ ఎమ్మెల్యే ఎంపీక..! ఆమె ఎవరో తెలుసా?

by Ramesh N |
పారిస్ ఒలింపిక్స్‌కు బీజేపీ ఎమ్మెల్యే ఎంపీక..! ఆమె ఎవరో తెలుసా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: పారిస్‌లో జరగనున్న ఒలింపిక్స్ -2024కు బీజేపీ ఎమ్మెల్యే శ్రేయాసి సంగ్ ఎన్నికయ్యారు. ఆమె బీహార్‌లోని జముయి ఎమ్మెల్యేగా ఉన్నారు. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) తాజాగా (జూన్ 21) పారిస్ 2024 ఒలింపిక్స్ కోసం తుది 21 మంది సభ్యులతో కూడిన భరత షూటింగ్ జట్టును ప్రకటించింది. అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్.. ఎన్ఆర్ఏఐ అభ్యర్థనను అంగీకరించి.. ఎన్ఆర్ఏఐ కోటా పున:కేటాయింపు తర్వాత ఆమె ఒలింపిక్ బెర్త్ సాధించారు.

గతంలో కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్ షూటింగ్ లలో పతకాలు సాధించిన శ్రేయాసి తొలిసారి ఒలింపిక్స్ కు అర్హత సాధించింది. 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో డబుల్ ట్రాప్ షూటింగ్ ఈవెంట్‌లో శ్రేయాసి సింగ్ రజత పతకాన్ని గెలిచారు. 2014 ఆసియా గేమ్స్‌లో డబుల్ ట్రాప్ టీమ్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని కూడా సాధించారు. గతంలో ఒలింపిక్స్‌కు ఎంపికైన షూటర్ల జాబితాలో శ్రేయాసి సింగ్ పేరు లేదు. నేడు ఒలింపిక్స్‌లో బెర్త్ సంపాధించడంతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

శ్రేయాసి సింగ్ ఎవరు?

శ్రేయాసి సింగ్ దివంగత మాజీ మంత్రి దిగ్విజయ్ సింగ్ కుమార్తె. ఒలింపిక్స్‌లో పాల్గొనాలనేది మా నాన్న పెద్ద డ్రీమ్ అని ఆమె తాజాగా మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు ఈ కల నిజమైందన్నారు. ఒలింపిక్స్‌లో దేశానికి స్వర్ణ పతకం సాధిస్తానని ధీమా వ్యక్తంచేశారు. జూలై 30, 31 తేదీల్లో జరిగే పోటీల్లో దేశానికి బంగారు పతకం సాధించేలా ప్రార్థించాలని ప్రజలకు శ్రేయాసి సింగ్ విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story