BGT 2024 : 147 ఏళ్లలో తొలిసారి.. నితీశ్-సుందర్ ఖాతాలో అరుదైన రికార్డు

by Sathputhe Rajesh |
BGT 2024 : 147 ఏళ్లలో తొలిసారి.. నితీశ్-సుందర్ ఖాతాలో అరుదైన రికార్డు
X

దిశ, స్పోర్ట్స్ : బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ బాక్సింగ్ డే టెస్ట్‌ మూడు రోజు ఆటలో 176 బంతుల్లో నితీశ్(105నాటౌట్)గా నిలిచాడు. వాషింగ్టన్ సుందర్‌ 162 బంతుల్లో 50 పరుగులు చేశాడు. నెంబర్ 8, 9 స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగిన ఈ యువ ఆల్ రౌండర్లు ఒకే ఇన్నింగ్స్‌లో వేర్వేరుగా 150 బంతులు ఎదుర్కొన్నారు. తద్వారా 147 ఏళ్ల తర్వాత ఈ అరుదైన రికార్డు అధిగమించారు.

ఆస్ట్రేలియాలో సెంచరీ.. మూడో అతి పిన్న వయస్కుడిగా..

ఎంసీజీలో సెంచరీ చేయడం ద్వారా ఆస్ట్రేలియా గడ్డపై అతి పిన్న వయసులో సెంచరీ చేసిన మూడో ఆటగాడిగా నితీశ్ నిలిచాడు. అంతకు ముందు 1992లో సచిన్ సిడ్నీ వేదికగా 18 ఏళ్ల 256 రోజులకు సెంచరీ చేసి ఈ జాబితాలో నెంబర్.1గా నిలిచాడు. 2019లో సిడ్నీలో 21 ఏళ్ల 92 రోజులకు సెంచరీ చేసి రిషబ్ పంత్ టాప్-2లో కొనసాగుతున్నాడు. తాజా మ్యాచ్‌లో 21 ఏళ్ల 216 రోజులకు సెంచరీ చేసిన నితీశ్ ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.1948లో 22 ఏళ్ల 46 రోజులకు సెంచరీ చేసి దత్తు ఫడ్కర్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.

8వ వికెట్ తర్వాత సెకండ్ హయ్యస్ట్ పార్ట్‌నర్‌షిప్

ఈ మ్యాచ్‌లో 8వ వికెట్‌కు నితీశ్-వాషింగ్టన్ సుందర్‌లు 127 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో భారత్ తరఫున ఆస్ట్రేలియాలో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన రెండో జోడీగా నిలిచారు. అంతకు ముందు 2008లో సిడ్నీ వేదికగా సచిన్-హర్భజన్ 129 పరుగుల పార్ట్‌నర్‌షిప్ చేశారు. 2008లోనే కుంబ్లే-హర్భజన్ సింగ్ అడిలైడ్‌ వేదికగా107 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఈ జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నారు.

తెలుగు కుర్రాడి ఖాతాలో మరికొన్ని రికార్డులు..

ఎంసీజీ మైదానంలో 8వ వికెట్‌‌‌కు దిగి నితీశ్(105 నాటౌట్) పరుగులు చేశాడు. తద్వారా ఈ గ్రౌండ్‌లో ఎనిమిదవ స్థానంలో అత్యధిక పరుగులు చేసిన తొలి ఆటగాడిగా నితీశ్ నిలిచాడు. 8వ స్థానంలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా సైతం నితీశ్ నిలిచాడు. అంతకుముందు 2008లో అడిలైడ్ వేదికగా జరిగిన టెస్ట్‌లో 8వ స్థానంలో దిగిన కుంబ్లే 87 పరుగులు ఇప్పటి వరకు హయ్యస్ట్ స్కోరుగా ఉంది. కుంబ్లే రికార్డును నితీశ్ తాజా ప్రదర్శనతో అధిగమించాడు.

Advertisement

Next Story