భారత్‌లో ఆడాలంటే భయం.. సౌతాఫ్రికా క్రికెటర్

by Vinod kumar |   ( Updated:2023-11-23 13:25:44.0  )
భారత్‌లో ఆడాలంటే భయం.. సౌతాఫ్రికా క్రికెటర్
X

న్యూఢిల్లీ : దక్షిణాఫ్రికాతో పోలిస్తే భారత్‌లో ఆడేందుకు ఉన్న తేడా గురించి దక్షిణాఫ్రికా బ్యాటర్ వాన్ డెర్ డస్సెన్ తెలిపాడు. వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా న్యూఢిల్లీలో శ్రీలంకపై జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన తర్వాత ఈ రైట్ హ్యాండర్ అందరి దృష్టిని ఆకర్షించాడు. తను ఉత్సాహంగా, భావోద్వేగభరితంగా ఉన్నందుకు భారత అభిమానులను కూడా ప్రశంసించాడు. తన స్వదేశం దక్షిణాఫ్రికాలో ఆడటం కంటే ఉపఖండంలో ఆడటం చాలా భిన్నంగా ఉంటుందన్న డస్సెన్.. ‘కఠిన పరిస్థితులు, వేడి వాతావరణం చూస్తే ఒక ఆటగాడిగా కాస్త భయంగా ఉంటుంది. కానీ భారత్‌లో ఆడటం ఎప్పుడూ గొప్ప ఫీలింగ్ ఇస్తుంది.

నిజాయితీగా చెప్పాలంటే ఉపఖండంలోని ప్రజలు, అభిమానులు భావోద్వేగభరితంగా ఉంటారు. కొన్నిసార్లు మీ గురించి కూడా మీరు ఆలోచించలేరు’ అని వాన్ డెర్ డుస్సెన్ పేర్కొన్నాడు. ఇక భారత్ ప్రపంచ స్థాయి జట్టని.. వారి స్వదేశంలో ఏ ప్రపంచ స్థాయి జట్టునైనా ఓడించడం చాలా కష్టమైని అభిప్రాయపడ్డాడు. అయితే ఎంత కఠినంగా ఉంటుందో, అంతకంటే సంతృప్తి ఇస్తుందని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed