బీసీసీఐ ప్రైజ్‌ మనీలో రోహిత్, కోహ్లీలకు ఎంత దక్కిందో తెలుసా?

by Harish |
బీసీసీఐ ప్రైజ్‌ మనీలో రోహిత్, కోహ్లీలకు ఎంత దక్కిందో తెలుసా?
X

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమ్ ఇండియాకు బీసీసీఐ రూ. 125 కోట్ల భారీ నజరానా అందజేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ క్యాష్ ప్రైజ్ ఆటగాళ్లకు మాత్రమేనా?లేదంటే బృందం మొత్తానికా? అన్న సందేహాలు వ్యక్తమవ్వగా.. తాజాగా బీసీసీఐ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. టీ20 వరల్డ్ కప్‌‌లో భాగమైన భారత బృందం మొత్తానికి నజరానా అందుతుందని పేర్కొన్నాయి. ఆటగాళ్లు, సపోర్టింగ్ స్టాఫ్, రిజర్వ్‌ ఆటగాళ్లు, ఇతర సిబ్బంది మొత్తం 42 మంది అమెరికా, వెస్టిండీస్ వెళ్లారు. రూ.125 కోట్లలో ఎవరెవరు ఎంత మొత్తం అందుకుంటారనే విషయంపై బీసీసీఐ వర్గాలు స్పష్టతనిచ్చాయి.

ప్రపంచకప్‌ జట్టుకు ఎంపికైన 15 మంది ఆటగాళ్లకు(ఒక్క గేమ్ కూడా ఆడని వారు సైతం) ఒక్కొక్కరికి రూ. 5 కోట్లు అందనున్నాయి. రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపికైన రింకు సింగ్, శుభ్‌మన్ గిల్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్‌లు రూ. కోటి చొప్పున అందుకుంటారు. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌‌కు రూ. 5 కోట్లు దక్కనున్నాయి. కోచింగ్ స్టాఫ్‌లోని బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్ దిలీప్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే‌లకు ఒక్కొక్కరికి రూ. 2.5 కోట్లు, ముగ్గురు ఫిజియోథెరపిస్టులు, ముగ్గురు త్రోడౌన్ స్పెషలిస్టులు, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్‌కు రూ. 2 కోట్ల చొప్పున ఇస్తారు. అలాగే, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌‌తో సహా మిగతా సెలెకర్లకు రూ. కోటి చొప్పున అందజేస్తారు.

Advertisement

Next Story

Most Viewed