- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మస్కట్ ఆవిష్కరణ..
దిశ, వెబ్‌డెస్క్: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ మార్చి 4 నుంచి ప్రారంభం కానుండగా.. గురవారం బీసీసీఐ, బోర్డు సెక్రటరీ జై షా దీనికి సంబంధించిన మస్కట్‌ను ఆవిష్కరించింది. ఈ మస్కట్‌ను శక్తి అని పిలుస్తున్నారు. ఈ సందర్భంగా 'శక్తి' లాంచింగ్ వీడియోను బీసీసీఐ కార్యదర్శి జై షా ట్విటర్‌లో షేర్ చేశారు. డబ్ల్యూపీఎల్ తొలి సీజన్‌లో ఐదు టీమ్స్ పాల్గొంటున్న విషయం తెలిసిందే. "వేగవంతమైనది, భయపెట్టేది, అగ్నితో కూడుకున్నది. ఫీల్డ్‌ను వెలిగించడానికి సిద్ధంగా ఉంది. ఇది ఆరంభం మాత్రమే.. మా డబ్ల్యూపీఎల్ మస్కట్ శక్తిని పరిచయం చేస్తున్నాం" అనే క్యాప్షన్‌తో జై షా ఈ వీడియో షేర్ చేశారు. ఈ మధ్యే డబ్ల్యూపీఎల్ థీమ్ సాంగ్ కూడా లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ పాటకు 'యే తో షురువాత్ హై' (ఇది ఆరంభం మాత్రమే) అనే టైటిల్ పెట్టారు. ఎన్నో అడ్డంకులను అధిగమించి దేశంలో క్రికెట్‌ను ఈ స్థాయికి తీసుకొచ్చిన మహిళా క్రికెటర్లకు జేజేలు పలుకుతూ ఈ పాట సాగింది.
ఐపీఎల్ తర్వాత ప్రపంచంలో రెండో అతిపెద్ద లీగ్ గా డబ్ల్యూపీఎల్ నిలవనుంది. ఇందులోని ఐదు టీమ్స్ విలువ రూ.4,669 కోట్లు కాగా.. మీడియా హక్కుల ద్వారా మరో రూ.951 కోట్లు బీసీసీఐ ఖాతాలో చేరాయి. ఈ లీగ్ తొలి సీజన్‌లో ఆర్సీబీ, ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ టీమ్స్ పాల్గొనబోతున్నాయి. డబ్ల్యూపీఎల్ ప్లేయర్స్ వేలం లో అత్యధికంగా స్మృతి మంధానా రూ.3.4 కోట్లకు అమ్ముడైన విషయం తెలిసిందే. ఆమెను ఆర్సీబీ టీమ్ కొనుగోలు చేసింది. ఇక ముంబై ఇండియన్స్ టీమ్ రూ.1.8 కోట్లకు హర్మన్ ను కొనుగోలు చేసి ఆమెకు కెప్టెన్సీ అప్పగించింది. డబ్ల్యూపీఎల్ మార్చి 4 నుంచి మార్చి 26 వరకు జరగనుంది. ఇందులో 20 లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
Fast, fierce and full of fire! She's ready to set the field ablaze, lekin #YehTohBasShuruatHai !
— Jay Shah (@JayShah) March 2, 2023
Introducing the embodiment of the #TATAWPL our mascot #Shakti ! @BCCI @BCCIWomen @wplt20 @viacom18#WPL2023 #WomensPremierLeague pic.twitter.com/oZcKm7aGwq