వారిపై వేటు వేయడం సరైందే : గంగూలీ

by Harish |
వారిపై వేటు వేయడం సరైందే : గంగూలీ
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా యువ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లను బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ నుంచి తప్పించిన విషయం తెలిసిందే. దీనిపై భారత మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించాడు. యువ క్రికెటర్లపై బోర్డు వేటు వేయడాన్ని సమర్థించాడు. బీసీసీఐ సరైన నిర్ణయం తీసుకుందని, ఇది దేశవాళీ క్రికెట్ ఆడని ఆటగాళ్లకు హెచ్చరికలాంటిదని తెలిపాడు. ‘అయ్యర్, ఇషాన్ కిషన్ రంజీ ట్రోఫీ ఆడకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. వాళ్లు టీమ్ ఇండియాకు అన్ని ఫార్మాట్లలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఐపీఎల్‌లోనూ భారీ ఒప్పందాలను కలిగి ఉన్నారు. మీరు కాంట్రాక్ట్‌ ప్లేయర్లు కాబట్టి, కచ్చితంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాలి. నిబంధనలను పాటించాలి. బీసీసీఐ సరైన నిర్ణయమే తీసుకుంది. రంజీ ట్రోఫీ ఆధారంగానే జాతీయ జట్టు ఎంపిక ఉంటుంది. ఐపీఎల్ ఆధారంగా కాదు.’ అని గంగూలీ చెప్పుకొచ్చాడు. కాగా, రంజీ ట్రోఫీకి అందుబాటులో ఉండనున్నట్టు ఇటీవల అయ్యర్ ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు తెలియజేశాడు. ముంబై, తమిళనాడు జట్ల మధ్య జరిగే సెమీస్‌కు అతను అందుబాటులో ఉండనున్నాడు. ఇషాన్ కిషన్ ఆడటంపై ఎలాంటి స్పష్టత లేదు.

Advertisement

Next Story

Most Viewed