- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆర్సీబీ జట్టులోకి బాబర్ ఆజామ్?
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమెరికాకు చెందిన నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ తర్వాత రెండో మోస్ట్ వాల్యూబుల్ టోర్నీ ఐపీఎలే. ఐపీఎల్ తర్వాత ఎన్నో లీగ్‌లు పుట్టుకొచ్చినా భారత టీ20 లీగ్‌కు వచ్చిన ఆదరణకు దరిదాపుల్లో కూడా లేవు. వరల్డ్ క్రికెట్‌లోని అత్యుత్తమ క్రికెటర్లు సైతం ఐపీఎల్‌లో ఒక్కసారైనా ఆడాలనుకుంటారు. పాక్ క్రికెటర్లు సైతం ఐపీఎల్‌లో ఆడాలనే తమ కోరికను పలు సందర్భాల్లో బయటపెట్టారు. ప్రతి సీజన్‌కు ముందు పాక్ అభిమానులు తమ దేశ క్రికెటర్లు ఐపీఎల్‌లో పాల్గొంటే చూడాలని ఉందని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూనే ఉంటారు. తాజాగా ఓ పాక్ అభిమాని చేసిన పోస్టు వైరల్‌గా మారింది.
పాక్ స్టార్ క్రికెటర్లు బాబర్ ఆజామ్, షాహిన్ అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్ ఫొటోలను సదరు అభిమాని ఐపీఎల్ ఫ్రాంచైజీ జెర్సీలతో ఎడిట్ చేశాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జెర్సీలో బాబర్ ఆజామ్ విరాట్ కోహ్లీతో మాట్లాడుతున్న ఫొటో, ముంబై ఇండియన్స్ జెర్సీలో బుమ్రాతో షాహిన్ అఫ్రిది ఉన్న ఫొటోలను పోస్టు చేశాడు. అలాగే, చెన్నయ్ సూపర్ కింగ్స్ జెర్సీలో ఉన్న మహ్మద్ రిజ్వాన్ ఫొటోను షేర్ చేశాడు. ఆ పోస్టుకు ‘ చాలా మంది భారత్, పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ కల’ అని రాసుకొచ్చాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియా వేదికగా వైరలయ్యాయి.
సదరు పాక్ అభిమానికి భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అదిరిపోయే రిప్లే ఇచ్చాడు. ‘భారతీయులకు అలాంటి కలలు లేవు. మీరు కూడా కలలు కనడం ఆపండి. నిద్ర లేవండి.’ అని ట్వీట్ చేశాడు. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాక్ ప్లేయర్లు ఐపీఎల్‌లో పాల్గొనడం లేదన్న విషయం తెలిసిందే. 2008 ఆరంభ సీజన్‌లో పలువురు పాక్ క్రికెటర్లు ఐపీఎల్ ఆడారు. మహ్మద్ హఫీజ్, సల్బాన్ బట్, ఉమర్ గుల్, కమ్రాన్ అక్మల్, యునిస్ కాన్, సోహెల్ తన్వీర్, మహ్మద్ ఆషిఫ్, షోయబ్ అక్తర్, షాహిద్ అఫ్రిది తొలి సీజన్‌లో పాల్గొన్నారు.
- Tags
- #ipl2024