- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గుజరాత్ జెయింట్స్ కెప్టెన్‌గా ఆస్ట్రేలియా ప్లేయర్..
దిశ, వెబ్‌డెస్క్: మహిళల ఐపీఎల్‌లో భాగంగా గుజరాత్ జెయింట్స్ జట్టు కెప్టెన్‌గా ఆస్ట్రేలియా ప్లేయర్ బెత్ మూనీని నియమించారు. మహిళల ఐపీఎల్ మొదటి సీజన్ మార్చి 4వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. డబ్ల్యూపీఎల్ మొదటి సీజన్‌కు గుజరాత్ జెయింట్స్ జట్టుకు కెప్టెన్‌గా ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ని నియమించింది. గుజరాత్ జెయింట్స్ మార్చి 4వ తేదీన డివై పాటిల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. బెత్ మూనీ చాలా కాలంగా ఆస్ట్రేలియా మహిళల జట్టులో కీలక సభ్యురాలిగా ఉంది.
బెత్ మూనీ 2016లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయగా.. ఆమె మొత్తం 4 టెస్టులు, 57 వన్డేలు, 83 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడింది. టెస్టుల్లో 26.29 సగటుతో 184 పరుగులు సాధించింది. వన్డేలలో 51.08 సగటుతో 1,941 పరుగులు సాధించింది. ఇందులో ఆమె 3 సెంచరీలు, 13 అర్థ సెంచరీలు ఉన్నాయి. టీ20 ఇంటర్నేషనల్‌లో 77 ఇన్నింగ్స్‌లలో 40.52 సగటు, 124.6 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 2,350 పరుగులు సాధించింది. ఇందులో 2 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.