ICC World Cup 2023: ఆసీస్‌కు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ ఔట్!

by Vinod kumar |
ICC World Cup 2023: ఆసీస్‌కు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ ఔట్!
X

దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023 ప్రారంభానికి ముందు ఆసీస్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ అష్టన్ అగర్ గాయంతో టోర్నీ మొత్తానికి దూరమైనట్లు తెలుస్తోంది. అగర్ ప్రస్తుతం కాలి కండరాల గాయంతో బాధపడుతున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో అగర్ గాయపడ్డాడు. ఆసీస్ మీడియా కథనాల ప్రకారం.. అగర్ గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు నాలుగు వారాల సమయం పడుతుందంట. ఈ క్రమంలోనే అతను వన్డే ప్రపంచకప్‌కు దూరం కానున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ట్రావిస్ హెడ్ దూరం కాగా.. ఇప్పుడు అగర్ కూడా దూరమైతే ఆసీస్ మరింత బలహీనం కానుంది.

Advertisement

Next Story

Most Viewed