ఆసీస్ మహిళా క్రికెటర్ల వేతనం 66% పెంపు

by Javid Pasha |
ఆసీస్ మహిళా క్రికెటర్ల వేతనం 66% పెంపు
X

సిడ్నీ: ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లు త్వరలో అత్యధిక పారితోషికం పొందే అథ్లెట్లుగా నిలవనున్నారు. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ అసోసియేషన్ మధ్య సోమవారం ఐదేళ్ల కోసం చారిత్రాత్మక వేతన ఒప్పందం కుదిరింది. మహిళల క్రికెట్‌కు అదనంగా 53 మిలియన్ డాలర్లు కేటాయించారు. దీంతో ప్రతి క్రికెటర్ వేతనం 66% పెరిగినట్టయింది.

ఇంగ్లాండ్‌లో ఉమెన్స్ హండ్రెడ్, ఇండియాలో డబ్ల్యూపీఎల్ టోర్నీలకు పోటీగా ఆస్ట్రేలియా డబ్ల్యూబీబీఎల్ క్రికెటర్ల వేతనాన్ని 50 శాతం పెంచింది. అయితే మెజారిటీ ఉన్న దేశవాళీ ప్లేయర్స్ 1,00,000 డాలర్లు అందుకోనున్నారు. మొత్తానికి స్టేట్, డబ్ల్యూబీబీఎల్ కాంట్రాక్ట్ దక్కించుకున్న ప్లేయర్స్‌కు సగటున 1,51,000 అందుతుంది.


Advertisement

Next Story

Most Viewed