- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాకిస్తాన్‌తో రెండో టెస్టు.. ఆసిస్ తొలి రోజు స్కోరు..?
మెల్‌బోర్న్ : మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా మంగళవారం పాకిస్తాన్‌తో ప్రారంభమైన రెండో టెస్టులో ఆస్ట్రేలియాకు శుభారంభం దక్కింది. వర్షం అంతరాయం కలిగించగా తొలి రోజు 66 ఓవర్ల ఆట మాత్రమే సాగింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసిస్ జట్టు 3 వికెట్లను కోల్పోయి 187 పరుగులు చేసింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్(38), ఉస్మాన్ ఖవాజా(42) జట్టుకు మంచి ఆరంభం అందించారు. తొలి సెషన్ మొత్తం ఆడిన ఈ జోడీ తొలి వికెట్‌కు 90 పరుగుల జోడించింది.
ఈ క్రమంలో పుంజుకున్న పాక్ బౌలర్లు.. స్వల్ప వ్యవధిలోనే వార్నర్, ఉస్మాన్ ఖవాజాలను పెవిలియన్ పంపారు. ఆ తర్వాత మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్ ఇన్నింగ్స్‌ను నడిపించారు. పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో వీరు పూర్తిగా డిఫెన్స్‌కే పరిమితమయ్యారు. అయితే, వికెట్లు కాపాడుకుంటూ బౌలర్లకు పరీక్ష పెట్టారు. ఈ క్రమంలో 46 పరుగులు జోడించిన తర్వాత స్మిత్ అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ట్రావిస్ హెడ్(9 బ్యాటింగ్)తో కలిసి లబుషేన్(44 బ్యాటింగ్) ఆచితూచి ఆడి తొలి రోజు ఆట ముగించారు. పాక్ బౌలర్లలో హసన్ అలీ, అమీర్ జమాల్, అఘా సల్మాన్ చెరో వికెట్ తీశారు. కాగా, తొలి టెస్టును ఆస్ట్రేలియా దక్కించుకున్న విషయం తెలిసిందే.