Asian Games 2023: పరుగుల సునామీ.. 9 బంతుల్లోనే ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ.. యువీ రికార్డు బ్రేక్‌!

by Vinod kumar |   ( Updated:2023-09-27 11:17:18.0  )
Asian Games 2023: పరుగుల సునామీ.. 9 బంతుల్లోనే ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ.. యువీ రికార్డు బ్రేక్‌!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా క్రీడలు -2023లో భాగంగా మెన్స్‌ క్రికెట్‌ ఈవెంట్లో నేపాల్‌- మంగోలియా మధ్య తొలి మ్యాచ్‌‌లో నేపాల్‌ ఆల్‌రౌండర్‌ దీపేంద్ర సింగ్‌ ఆరీ పరుగుల సునామీ సృష్టించాడు. మంగోలియాతో మ్యాచ్‌లో విధ్వంసకర హాఫ్‌ సెంచరీ చేశాడు. కేవలం 9 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించి చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ పేరిట(ఇంగ్లండ్‌‌పై 12 బంతుల్లో) ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. టీ20 క్రికెట్‌లో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ నమోదు చేసిన బ్యాటర్‌గా అరుదైన ఘనత సాధించాడు.

ఈ మ్యాచ్‌లో ఐదోస్థానంలో బ్యాటింగ్‌ దిగిన ఈ ఆల్‌రౌండర్‌ 10 బంతుల్లో 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా 8 సిక్సర్లు ఉండటం విశేషం. ఈ క్రమంలో ఎదుర్కొన్న తొలి ఆరు బంతుల్లోనే వరుసగా ఆరు సిక్సర్లు బాదిన తొలి బ్యాటర్‌గానూ చరిత్రకెక్కాడు.

Advertisement

Next Story

Most Viewed