IND Vs NEP: 3 ఈజీ క్యాచ్‌లు మిస్‌.. 4 మిస్ ఫీల్డ్స్! టీమిండియా చెత్త ఫీల్డింగ్..

by Vinod kumar |   ( Updated:2023-09-04 11:59:27.0  )
IND Vs NEP: 3 ఈజీ క్యాచ్‌లు మిస్‌.. 4 మిస్ ఫీల్డ్స్! టీమిండియా చెత్త ఫీల్డింగ్..
X

దిశ, వెబ్‌డెస్క్: నేపాల్‌తో మ్యాచ్‌లో టీమిండియా ఫీల్డర్ల పొరపాట్లపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. పసికూనతో మ్యాచ్‌ అనే నిర్లక్ష్యం వద్దని.. ప్రత్యర్థిని తేలికగా తీసుకుంటే భారీ మూల్యం చెల్లించకతప్పని హెచ్చరిస్తున్నారు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో నేపాల్ 104 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్ల ముందు నేపాల్ బ్యాటర్లు నిలవడం కష్టమేనని అనుకున్నారు.. కానీ భారత ఫీల్డింగ్ తప్పిదాలను కరెక్టుగా వాడుకుంటూ నేపాల్ ఓపెనర్లు ఇద్దరూ 9.5 ఓవర్ల పాటు వికెట్ పడకుండా బ్యాటింగ్ చేశారు. మహ్మద్ షమీ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లో ఆఖరి బంతికి కుశాల్ బుర్టెల్ ఇచ్చిన క్యాచ్‌ని స్లిప్‌లో శ్రేయాస్ అయ్యర్ జారవిడిచాడు.

ఆ తర్వాత మమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఆసిఫ్ షేక్ ఇచ్చిన క్యాచ్‌ని విరాట్ కోహ్లీ నేలపాలు చేశాడు. చేతుల్లో పడిన క్యాచ్‌ని అందుకోవడంలో కోహ్లీ విఫలం కావడంతో ఆసిఫ్ షేక్‌కి లైఫ్ లభించింది. ఆ తర్వాత మహ్మద్ షమీ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో కుశాల్ బుర్టెల్ ఇచ్చిన క్యాచ్‌ని ఇషాన్ కిషన్ వదిలేశాడు. కుశాల్ బ్యాటు అంచుని తాకుతూ వెళ్లిన బంతి, ఇషాన్ కిషన్ గ్లవ్స్‌ని తాకుతూ బౌండరీకి దూసుకెళ్లింది.. ఈ మూడు ఛాన్సులను వాడుకుంటూ ఓపెనర్లు దూకుడుగా బ్యాటింగ్ చేశారు.

ఎట్టకేలకు.. శార్దూల్‌కు తొలి వికెట్‌..

దీంతో ఎట్టకేలకు టీమిండియాకు తొలి వికెట్‌ దక్కింది. పదో ఓవర్‌ ముగిసే సరికి ఒక వికెట్‌ నష్టానికి నేపాల్‌ 65 పరుగుల మెరుగైన స్కోరు చేసింది. మరోవైపు.. 10 ఓవర్లు ముగిసే సరికి ఆసిఫ్‌ 4 ఫోర్ల సాయంతో 23 పరుగులు చేసి.. భీమ్‌ షర్కీతో కలిసి క్రీజులో ఉన్నాడు.

Advertisement

Next Story