Asia Cup 2023: నేపాల్‌ ఆలౌట్‌.. టీమిండియా టార్గెట్ ఇదే

by Vinod kumar |
Asia Cup 2023: నేపాల్‌ ఆలౌట్‌.. టీమిండియా టార్గెట్ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నేపాల్ ఊహించిన దాని కంటే మంచి స్కోరే సాధించింది. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని 48.2 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు కుశాల్ బార్టెల్ (38), అసిఫ్‌ షేక్ (58) రాణించారు. లోయర్ ఆర్డర్ బ్యాటర్ సోమ్‌పాల్ (48) కూడా మెరిశాడు. గుల్షాన్‌ జా (23), దీపేంద్ర సింగ్ (29) చెప్పుకోదగ్గ పరుగులు చేశారు. భారత బౌలర్లలో.. రవీంద్ర జడేజా 3, సిరాజ్ 3, షమి, హార్దిక్ పాండ్య, శార్దూల్ ఠాకూర్‌ తలో వికెట్ పడగొట్టారు.

Advertisement

Next Story