Asia Cup 2023: ఆసియా కప్ షెడ్యూల్ ప్రకటన అప్పుడే.. దాయాదుల మ్యాచ్‌‌కు డేట్ ఫిక్స్!

by Vinod kumar |
Asia Cup 2023: ఆసియా కప్ షెడ్యూల్ ప్రకటన అప్పుడే.. దాయాదుల మ్యాచ్‌‌కు డేట్ ఫిక్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుల మధ్య చాలా గొడవల తర్వాత ఆసియా కప్‌ 2023 నిర్వహణకు అన్ని మార్గాలు క్లియర్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కొత్త చీఫ్ జకా అఫ్రాఫ్ చేతుల మీదుగా ఆసియా కప్ 2023 షెడ్యూల్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. లాహోర్‌లో బుధవారం సాయంత్రం 7.45 గంటలకు ఆసియా కప్ షెడ్యూల్ విడుదల చేస్తున్నట్లు పీసీబీ ప్రకటించింది. కాగా, ఆసియా కప్‌కు ఈసారి హైబ్రీడ్‌ మోడ్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. భారత్‌ ఆడే మ్యాచ్‌లు సహా మొత్తం 9 మ్యాచ్‌లకు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుండగా.. పాకిస్తాన్‌ నాలుగు మ్యాచ్‌లకు వేదిక కానుంది. వన్డే వరల్డ్‌కప్‌ నేపథ్యంలో ఆసియా కప్‌ ఈసారి 50 ఓవర్ల ఫార్మాట్‌లో జరగనుంది.

ఆసియాకప్ 2023లో భాగంగా మొత్తం 13 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతాయి. గ్రూప్ ఎలో ఇండియా, పాకిస్థాన్, నేపాల్ ఉండగా.. గ్రూప్ బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ ఉన్నాయి. ఈ లెక్కన ఇండియా, పాకిస్థాన్ టీమ్స్ సూపర్ 4లోనూ తలపడటం ఖాయం. ఈ లెక్కన ఆసియా కప్‌లో కనీసం రెండుసార్లు ఈ రెండు జట్లు పోటీ పడతాయి. అదే జరిగితే ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా సెప్టెంబర్ 10న ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ ఉంటుంది. డ్రాఫ్ట్ షెడ్యూల్ ప్రకారం.. ఆ రోజు ఏ1, ఏ2 మధ్య క్యాండీలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇక సూపర్ 4 స్టేజ్‌లో సెప్టెంబర్ 6న ఒక్క మ్యాచ్ మాత్రమే పాకిస్థాన్‌లో జరుగుతుంది.

ఇక టోర్నీలో తొలి మ్యాచ్ పాకిస్థాన్‌లోని ముల్తాన్‌లో పాకిస్థాన్, నేపాల్ మధ్య జరగనుంది. ఫైనల్ మ్యాచ్‌కు శ్రీలంకలోని కొలంబో ఆతిథ్యమివ్వనుంది. ఆసియా కప్‌కు సంబంధించి ఏసీసీ షెడ్యూల్‌ను ఇంకా ఫైనలైజ్ చేయలేదు. ఇందులో మరికొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈసారి పాకిస్థాన్, శ్రీలంకలలో టోర్నీ జరగనుండటంతో డ్రాఫ్ట్ షెడ్యూల్లో తరచూ మార్పులు తప్పడం లేదు.

Advertisement

Next Story

Most Viewed