ఆస్ట్రేలియా ప్లేయర్‌ను వెనక్కి నెట్టి.. రికార్డు సృష్టించిన అశ్విన్

by Gantepaka Srikanth |
ఆస్ట్రేలియా ప్లేయర్‌ను వెనక్కి నెట్టి.. రికార్డు సృష్టించిన అశ్విన్
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) రికార్డు సృష్టించారు. ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్‌(World Test Champion Ship)లో అత్యధిక వికెట్లు(188) తీసిన బౌలర్‌గా నిలిచారు. న్యూజిలాండ్‌తో పూణే వేదికగా జరుగుతోన్న రెండో టెస్టులో కివీస్ బ్యాటర్ లాథమ్‌ను ఔట్ చేసి ఈ ఫీట్ సాధించారు. దీంతో ఆస్ట్రేలియా బౌలర్ నాథన్ లయన్(187) రికార్డు బద్దలు కొట్టిన అశ్విని.. 188 వికెట్లతో సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. కాగా, టాప్-5 లో అశ్విన్(188), లయన్(187), కమిన్స్(175), స్టార్క్(147), బ్రాడ్(134)లు ఉన్నారు. ఇదిలా ఉండగా.. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో టీమిండియా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ స్టేడియంలో ఇరు జట్లు తొలిసారిగా టెస్ట్‌లో తలపడనున్నాయి. ప్రస్తుతం 43 ఓవర్లలో మూడు వికెట్ల నష్టపోయిన కవీస్.. 138 పరుగులు చేసింది.

Advertisement

Next Story