- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నిలకడగా రాణించడంపై ఫోకస్ పెట్టా : అర్ష్‌దీప్ సింగ్
దిశ, స్పోర్ట్స్ : నిలకడగా రాణించడంపై దృష్టి పెట్టినట్టు టీమ్ ఇండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తెలిపాడు. బెంగళూరు వేదికగా బుధవారం భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు మంగళవారం నిర్వహించిన ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో అర్ష్‌దీప్ సింగ్ మాట్లాడాడు. గత సంవత్సరం భిన్న ప్రదర్శనలను కలిగి ఉన్నానని, వాటి నుంచి చాలా నేర్చుకున్నానని చెప్పాడు. అనుభవం తన ఆటను మరింత మెరుగుపర్చుకోవడానికి ఉపయోగపడుతుందన్నాడు. ‘జట్టు, సపోర్టింగ్ స్టాఫ్ నుంచి నాకు చాలా మద్దతు లభిస్తోంది. నా ప్రదర్శనలో హెచ్చుతగ్గులను తగ్గించాలనుకుంటున్నా. జట్టుకు మెరుగైన ఫలితాలు అందించడానికి నిలకడగా రాణించడంపై ఫోకస్ పెట్టా.’ అని తెలిపాడు. ‘సిరీస్‌ను పూర్తి చేయడం మా లక్ష్యం కాదు. ప్రతి మ్యాచ్ నుంచి ఎంత మెరుగవడం, నైపుణ్యాలను పెంచుకోవడం మా లక్ష్యం. బౌలర్లుగా ఎం.చిన్నస్వామి స్టేడియంలో మేము కోల్పోయేది ఏం లేదు. వికెట్ ఫ్లాట్‌గా, బౌండరీలు చిన్నగా ఉన్నా స్టేడియంలో బ్యాటర్లు ఎక్కువగా బౌండరీలు కొట్టాలని చూస్తారు. అదే వాళ్లను ఒత్తిడిలోకి నెట్టేస్తుంది. అప్పుడు మేము వికెట్లను సాధించేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి.’ అని అర్ష్‌దీప్ చెప్పుకొచ్చాడు. కాగా, తొలి రెండు మ్యాచ్‌ల్లో అర్ష్‌దీప్ 3 వికెట్లు తీశాడు.