- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శీతల్ ప్రతిభకు ఆనంద్ మహీంద్రా ఫిదా.. నచ్చిన కారు ఎంచుకో అంటూ ఆఫర్
దిశ, వెబ్ డెస్క్ : అన్ని ఉండి కూడా కొంత మంది ఏమీ సాధించలేరు. కానీ ఓ భారతీయ యువతి మాత్రం రెండు చేతులు లేకపోయినా పారా ఏషియన్ గేమ్స్‌లో తన సత్తా చాటుకుంది. ఆర్చరీలో రెండు పసిడి పతకాలు, ఒక రజతం గెలుచుకున్న శీతల్ దేవి ప్రతిభను చూసిన ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యానికి లోనయ్యారు. తమ కంపెనీకి చెందిన కార్లలో ఏ కారు కావాలో ఎంచుకోమని ఆఫర్ చేశారు. శీతల్‌కు ఎన్నుకున్న కారును ఆమె డ్రైవింగ్ చేసేందుకు అనుగుణంగా తీర్చిదిద్ది అందిస్తామని ప్రకటించారు. అంతే కాదు శీతల్‌ను ప్రశంసిస్తూ, ఆమె జీవిత కథను తెలిపే ఓ వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేశారు. ‘శీతల్ శీతల్ అందరికీ గురువు. తనని చూసిన తర్వాత జీవితంలో చిన్న సమస్యల పై బాధ పడను. తన అవరోధాల ముందు మన సమస్యలు చిన్నవి అని ట్వీట్ చేశారు.
శీతల్ కశ్మీర్‌లో గల కిస్త్వాడ్ జిల్లా లోయిధర్ కు చెందిన యువతి. ఆమెకు రెండు చేతులూ లేవు. అయినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగింది. చదువుకుంటూనే ఆట, పాటల్లో పాల్గొనేది. తనకి ఓ మంచి గురువు దొరకడంతో అర్చరీలో శిక్షణ తీసుకుంది. చేతులు లేకపోయిన కాళ్లతోనే విలు విద్య నేర్చుకుని గురి తప్పకుండా విల్లు ఎక్కుపెట్టేది. ఆత్మస్థైర్యంతో పోటీల్లో పాల్గొన్ని విజయాలు సాధించేది. అలాగే స్వర్ణం పతకం కూడా సాధించింది.