- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చరిత్ర సృష్టించిన ఐర్లాండ్.. టెస్టు హోదా పొందిన ఆరేళ్ల తర్వాత ఘనత
దిశ, స్పోర్ట్స్ : ఐర్లాండ్ సంచలనం సృష్టించింది. ఏకైక టెస్టులో ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించి తొలి టెస్టు విజయం అందుకుంది. 2018లో ఐర్లాండ్ టెస్టు హోదా పొందగా దాదాపు ఆరేళ్ల తర్వాత ఆ జట్టు టెస్టుల్లో తొలిసారిగా గెలుపు రుచిచూసింది. అబుదాబి వేదికగా జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో శుక్రవారం 6 వికెట్ల తేడాతో ఐర్లాండ్ విజయం సాధించింది. అఫ్గాన్ నిర్దేశించిన 111 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మొదటి నుంచి ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఐర్లాండ్ ఆటగాళ్లు మ్యాచ్‌ను మూడు రోజుల్లోనే ముగించారు.
తొలి ఇన్నింగ్స్‌లో అఫ్గాన్ జట్టు 155 పరుగులు చేయగా.. ఐర్లాండ్ 263 పరుగులు చేసి 108 పరుగుల ఆధిక్యం సాధించిన విషయం తెలిసిందే. భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన అఫ్గాన్‌ను ఐర్లాండ్ బౌలర్లు మరోసారి తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. ఓవర్‌నైట్ స్కోరు 134/3తో శుక్రవారం ఆట కొనసాగించిన ఆఫ్ఘనిస్తాన్ 218 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ షాహిది(55), గుర్బాజ్(46) ఆకట్టుకోగా.. మిగతా వారు నిరాశపరిచారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ ఎడైర్, మెక్‌కార్తీ, క్రైయిగ్ యంగ్ మూడేసి వికెట్లతో ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 108 తీసివేయగా 111 లక్ష్యాన్ని ఐర్లాండ్ 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 39/4 స్కోరుతో ఐర్లాండ్ తడబడిన సమయంలో కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీ(58 నాటౌట్) హాఫ్ సెంచరీ మెరిశాడు. టక్కర్(27 నాటౌట్) సహాయంతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో 8 వికెట్లు తీసి ఐర్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన మార్క్ ఎడైర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.