Yashasvi Jaiswal: అసలు వాళ్లు 'పానీపూరీ' అమ్మలేదు.. యశస్వి జైశ్వాల్‌ చిన్ననాటి కోచ్ షాకింగ్ కామెంట్స్

by Vinod kumar |
Yashasvi Jaiswal: అసలు వాళ్లు పానీపూరీ అమ్మలేదు.. యశస్వి జైశ్వాల్‌ చిన్ననాటి కోచ్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం భారత క్రికెట్ ప్రపంచంలో ట్రెండింగ్‌లో ఉన్న పేరు యశస్వి జైస్వాల్‌ది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఐపీఎల్, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి జాతీయ జట్టుకు ఎంపికైన జైస్వాల్ అరంగేట్రం మ్యాచ్‌లోనే రెచ్చిపోయాడు. వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టెస్టుతో డెబ్యూ చేసిన జైశ్వాల్‌.. తన తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో చెలరేగి చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 382 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్‌ 16 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 171 పరుగులు చేశాడు. అయితే యశస్వీ క్రికెట్‌ ఫీల్డ్‌లో అదరగొట్టిన ప్రతీసారి.. అతడి పానీ పురీ స్టోరీ బయటకు వస్తోంది. గతంలో యశస్వీ తన క్రికెట్ శిక్షణ కోసం పానీ పూరీలను విక్రయించేవాడని పలుసార్లు మనం వింటూ వస్తున్నాం. ఈ వార్తలను యశస్వి జైస్వాల్ చిన్ననాటి కోచ్ జ్వాలా సింగ్ తోసిపూచ్చాడు. జైస్వాల్ తన జీవనోపాధి కోసం ఎప్పుడూ పానీపూరీలు అమ్మలేదని అతడు చెప్పుకొచ్చాడు. జైస్వాల్ పానీపూరి స్టోరీపై జ్వాలా సింగ్ పూర్తి క్లారిటీ ఇచ్చాడు.

అసలు నిజం ఇదే..

ఓ ఇంటర్వ్యూలో జైశ్విల్‌ను కొన్ని వ్యక్తిగత ప్రశ్నలు అడిగారు. అప్పుడు జైశ్వాల్‌ తన అమాయకత్వంతో పానీపూరీ సంఘటనను ప్రస్తావించాడు. అయితే జర్నలిస్టులు వారు స్టోరిలకు వెయిటేజీ ఇవ్వడం కోసం పానీపూరీ అంశాన్ని తమ హెడ్‌లైన్స్‌గా ఉపయోగించుకున్నారు. ఆ హెడ్‌లైన్స్‌ చూసి నేను షాక్‌ అయ్యా. ఎందుకంటే నేను అతడిని నా కొడుకులా పెంచి అన్ని సౌకర్యాలు కల్పించాను. జైశ్వాల్‌ అద్భుతంగా ఆడిన ప్రతిసారీ, పానీపూరీ స్టాల్‌లో ఒక వ్యక్తితో కలిసి ఉన్న ఫోటో బయటకు వస్తోంది. మీడియా సంస్థలు జైశ్వాల్‌ పక్కన ఉన్న వ్యక్తి తన తండ్రి అని ప్రచురిస్తాయి. అతడు జైశ్వాల్‌ తండ్రి కాదు. అది అనుకోకుండా దిగిన ఫోటో. జైశ్వాల్‌ తండ్రి ఎప్పుడూ జీవనోపాధి కోసం పానీపూరీలు అమ్మలేదు. జైశ్వాల్‌ కూడా ఎప్పుడూ పానీపూరీలు అమ్మలేదు. ఈ విషయాన్ని చాలా సార్లు తెలియజేశాం.

2013లో జైశ్వాల్‌ నాతో క్రికెట్ శిక్షణ ప్రారంభించాడు. జైశ్వాల్‌ ముంబైకి వచ్చిన మొదటిలో ఓ టెంట్‌లో నివసించేవాడు. ఆ సమయంలో కరెంటు, సరైన ఆహారం వంటి కనీస సౌకర్యాలు కూడా లేవు. వర్షాకాలంలో వారు వేసుకున్న టెంట్ నీటితో నిండిపోయేది. జైశ్వాల్‌ తన చిన్నతనంలో ఓ దుఖణాంలో పనిచేసేవాడు. అతని తల్లిదండ్రులు అతనికి ప్రతి నెల రూ. 1000 రపాయలు పంపేవారు. గత 10 సంవత్సరాలుగా యశస్వినిని చూస్తున్నానని, U-19 ప్రపంచ కప్ 2020కి ముందు పానీపూరీ అమ్మినట్లుగా కథనాలు రాశారు. ఈ రకమైన స్టోరీలు అతనికి సహాయం చేసిన వ్యక్తులను కించపరుస్తాయి. అతడు ఈ స్ధాయికి చేరుకోవడానికి నేను నా వంతు కృషి చేశాను.

నా జీవితంలో విలువైన 9 ఏండ్ల కాలన్ని యశస్వీకి ఇచ్చాను. అయితే చివరగా జైశ్వాల్‌ను ఈ స్ధాయిలో చూడడం చాలా సంతోషంగా ఉంది అని తాజాగా ఓ స్పోర్ట్స్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జ్వాలా సింగ్ పేర్కొన్నాడు. ఇప్పుడు ప్రశ్న ఎవరు నిజం చెబుతున్నారు..? ఎవరు అబద్ధం..? చెబుతున్నారనేది తెలియాల్సి ఉంది. యశస్వి నిజం చెబితే.. అతని కోచ్ జ్వాలా సింగ్ అబద్ధం చెప్పటినట్లేనని తెలిస్తుంది. దీంతో ప్రస్తుతం నెటిజన్లు యశస్వి, ఆయన చిన్ననాటి కోచ్‌ జ్వాలాసింగ్‌లో ఎవరు నిజం చెబుతున్నారో తెలియక తికమక పెడుతున్నారో తెలియని అయోమయంలో పడ్డారు.

Advertisement

Next Story

Most Viewed