వడోదరలో హర్ధిక్ పాండ్యకు ఘన స్వాగతం.. జన సముద్రాన్ని తలపించిన పట్టణం (వీడియో)

by Mahesh |   ( Updated:2024-07-15 14:56:10.0  )
వడోదరలో హర్ధిక్ పాండ్యకు ఘన స్వాగతం.. జన సముద్రాన్ని తలపించిన పట్టణం (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: భారత స్టార్ ప్లేయర్. టీ20 ప్రపంచ కప్ విన్నింగ్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు వడోదరలో ఘన స్వాగతం లభించింది. జూన్ 29న జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించించడంలో పాడ్యా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ప్రపంచ కప్ విజయం తర్వాత మొట్టమొదటిసారిగా పాండ్యా తను పుట్టిన గడ్డకు చేరుకున్నారు. దీంతో వడోదరలో పాండ్యా ర్యాలీకి ఘనంగా స్వాగతం పలికారు. వేల సంఖ్యలో పాండ్యా అభిమానులు రోడ్లపైకి వచ్చారు. దీంతో వడోదర వీదులు జన సముద్రాన్ని తలపించాయి. కాగా పాండ్యా ర్యాలీ కోసం వడోదర పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే 2024 ఐపీఎల్ సీజన్ లో ముంబై కెప్టెన్ గా పాండ్యాను ప్రకటించినప్పటి నుంచి అతనిపై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ జరిగాయి. అయినప్పటికి పాండ్యా వాటిని పట్టించుకోకుండా టీ20 ప్రపంచ కప్ ను గెలిపించి తనను ట్రోల్స్ చేసిన వారి తోనే గ్రేట్ ప్లేయర్ అనిపించుకున్నాడు.

వడోదరలో జన సముద్రం నడుమ హర్ధిక్ పాండ్యా రోడ్ షో.. వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Advertisement

Next Story

Most Viewed