- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆఖరి టీ20లో బంగ్లాకు షాకిచ్చిన ఐర్లాండ్..
చటోగ్రామ్: ఆతిథ్య బంగ్లాదేశ్‌కు చివరి టీ20ల్లో ఐర్లాండ్ జట్టు షాకిచ్చింది.ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకున్న బంగ్లాకు క్లీన్‌స్వీప్ చేసే అవకాశం దక్కకుండా చేసింది. శుక్రవారం జరిగిన మూడో టీ20లో 7 వికెట్ల తేడాతో ఐర్లాండ్ విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా జట్టును ఐర్లాండ్ బౌలర్లు 19.2 ఓవర్లలోనే కూల్చేశారు. 41 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్‌ను షమీమ్ హొస్సేన్(51) ఆదుకోవడంతో ఆ జట్టు 124 పరుగులు చేయగలిగింది.
ఛేదనలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్(77) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడటంతో స్వల్ప లక్ష్యాన్ని ఐర్లాండ్ 14 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్ రాస్ అడైర్(7), లోర్కాన్ టక్కర్(4) నిరాశపర్చినప్పటికీ.. పాల్ స్టిర్లింగ్ ఊచకోతతో ఐర్లాండ్ గెలుపు దిశగా దూసుకెళ్లింది. పాల్ స్టిర్లింగ్ అవుటైనప్పటికీ.. హ్యారీ టెక్టెర్(14 నాటౌట్), కర్టిస్ కాంఫర్(16 నాటౌట్) మరో వికెట్ కోల్పోకుండా జట్టుకు విజయాన్ని అందించారు. బంగ్లాదేశ్ గడ్డపై బంగ్లాను ఓడించడం ఐర్లాండ్‌కు ఇదే మొదటిసారి. మూడు టీ20ల సిరీస్‌ను 2-1 తేడాతో ఐర్లాండ్ కోల్పోయింది.