- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వీర్యకణాల్లోనూ కరోనా
దిశ, వెబ్ డెస్క్ :
కరోనా వైరస్ ఇప్పటి వరకు ముక్కు, నోరు, గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందని మనందరికీ తెలుసు. అందువల్ల కరోనా వైరస్ కట్టడి కోసం మనమంతా భౌతిక దూరం పాటించాం. మాస్కులను కూడా ధరిస్తున్నాం. అయితే కరోనా వైరస్ కేవలం ఆ భాగాల ద్వారానే కాక.. కళ్ల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని ఇటీవలే సైంటిస్టులు తేల్చారు. కళ్లపై ఉండే కంజక్టివా అనే సూక్ష్మమైన కణజాలం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని వారు గుర్తించిన విషయం కూడా తెలుసు. అయితే రీసెంట్ గా వీర్యకణాల్లోనూ కరోనా వైరస్ ఉన్నట్లు శాస్ర్తవేత్తలు గుర్తించారు.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ రోజురోజుకు వ్యాప్తి చెందుతూ వైద్యులకు, శాస్ర్తవేత్తలకు సవాల్ విసురుతోంది. ఇప్పటికే ముక్కు, నోరు, గాలి, కళ్ల ద్వారా వైరస్ చెందుతున్నప్పటికీ .. అది ఎలా వ్యాప్తి చెందుతుందో అన్న విషయంలో మరిన్ని కోణాల్లో శాస్ర్తవేత్తలు అధ్యయనాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా కరోనా సోకిన వాళ్లు కోలుకున్న తర్వాత కూడా కొన్ని రోజుల పాటు వారి వీర్యకణాల్లో కరోనా వైరస్ ఉన్నట్లు చైనా డాక్టర్లు గుర్తించారు. షాంగిక్యు మున్సిపల్ హాస్పిటల్ కు చెందిన డాక్టర్లు దీనిపై పరిశోధన చేశారు. చైనాలో కరోనా బారిన పడి కోలుకున్న 38 మంది వీర్యాన్ని సేకరించి పరీక్షలు చేయగా, వీరిలో ఆరుగురిలో కరోనా వైరస్ ఉన్నట్లు గుర్తించారు. వీరు కరోనా నుంచి కోలుకున్నప్పటికీ వీర్య కణాల్లో మాత్రం కరోనా వైరస్ బతికే ఉన్నట్లు తేలింది. అయితే కరోనా వైరస్ వీర్యంలో ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేకపోయారు. అయితే శృంగారం ద్వారా వ్యాప్తి చెందుతుందా అనేదానిపై పరిశోధకులు ఏ నిర్ణయానికి రాలేకపోతున్నారు. చాలా తక్కువ మందిపై పరిశోధనలు చేశామని, సెక్స్ వల్ల కరోనా వస్తుందా? రాదా? అనే విషయంపై స్పష్టత రావాలంటే ఎక్కువ మందిపై పరిశోధనలు చేయాల్సి ఉంటుందని డాక్టర్లు తేల్చి చెప్పారు. ఒకవేళ సెక్స్ వల్ల కరోనా వైరస్ సోకితే .. అడ్డుకోవడం చాలా కష్టమని వైద్యులు పేర్కొన్నారు. అయితే ఇది వరకు వీర్యకణాల్లో వైరస్ ఉందా? లేదా? అనే అంశంపై పలు అధ్యయనాలు జరగగా ఎందులోనూ పాజిటివ్ ఉన్నట్లు రాలేవు. వీర్యకణాల్లో కరోనా వైరస్ ఉన్నట్లు ఈ ఒక్క అధ్యయనంలోనే తేలింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో కరోనా నుంచి కోలుకున్న 12మంది పై కూడా పరిశోధనలు చేశారు. ఏ ఒక్కరి వీర్యకణాల్లోనూ కోవిడ్ 19 వైరస్ ఉన్నట్లు తేలలేదు. వీర్యకణాల్లో కరోనా వైరస్ ఉన్నట్లు చెబుతున్నప్పటికీ, ఆ టెస్టుల్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని బ్రిటన్ షెఫీల్డ్ యూనివర్సిటీకి చెందిన ఆండ్రాలజీ ప్రొఫెసర్ అలెన్ పాసే అంటున్నారు. ఒకవేళ ఉన్నప్పటికీ దాని వల్ల కరోనా వైరస్ వస్తుందన్న ఆధారాలు ఏం లేవని ఆయన అన్నారు. అయినా ఇందులో ఏ మాత్రం ఆశ్చర్యం లేదని, ఎబోలా, జికా వైరస్ లు ప్రబలిన సమయంలో కూడా ఆయా బాధితుల వీర్యకణాల్లో ఆయా వైరస్ లు ఉన్నాయన్నారు. ‘వీర్యంలో కరోనా ఉన్నంత మాత్రానా శృంగారం ద్వారా మరొకరికి వస్తుందని చెప్పలేం. ఒకవేళ అదే ప్రూవ్ అయితే శృంగారానికి దూరంగా ఉంటేనే మంచిది’ అని చైనా పరిశోధకులు పేర్కొంటున్నారు. అంతేకాదు . కరోనా పేషెంట్లు కోలుకున్న కొంతకాలం పాటు శృంగారానికి దూరంగా ఉండటమే మంచిదని డబ్య్లూహెచ్ఓ హెచ్చరించిన విషయం అందరికీ తెలిసిందే.