- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దీపావళి ‘గాయాల’ కోసం ముందస్తు ఏర్పాట్లు
దిశ, తెలంగాణ బ్యూరో: దీపావళీ గాయల కోసం సర్కార్ ముందస్తు ఏర్పాట్లు చేసింది. గాయల చికిత్సకు ఉస్మానియా ఆసుపత్రిలో ఆరుగురు ప్లాస్టిక్ సర్జన్లకు స్పెషల్ డ్యూటీ వేసింది. దీంతో ప్రస్తుతం ఉన్న ఇద్దరిని కలుపుకొని గురువారం నుంచి 8 మంది ప్లాస్టిక్ సర్జన్లు బార్నింగ్ వార్డులలో విధులు నిర్వర్తించనున్నారు. అంతేగాక గాయాలకు కావాల్సిన మందులు, కాటన్, బ్యాండెజ్, సూదులు, క్రీములను కూడా అందుబాటులో ఉంచారు. చేతులు, కాళ్లు, శరీర భాగాలు కాలిన బాధితులకు ప్రత్యేకంగా చికిత్సను అందించేందుకు వార్డును కూడా ఏర్పాటు చేశారు. ఆసుపత్రికి వచ్చిన బాధితులకు ప్రాథమిక పరీక్షలు చేసి, అవసరం మేరకు చికిత్సను అందించనున్నారు. స్వల్ప గాయాలకు ప్రాథమిక చికిత్స నిర్వహించి మందులు ఇస్తుండగా, మధ్యస్థ, తీవ్ర గాయాలు కలిగిన వారిని రెండు రోజుల పాటు పర్యవేక్షించేందుకు సౌకర్యాలనూ కల్పించినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే గడిచిన రెండు రోజుల నుంచి ఆరుగురు బాధితులు తీవ్ర గాయాలతో అడ్మిట్ అయినట్లు ఉస్మానియా ఆసుపత్రి అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని, వీరిలో ఇద్దరికి కంటి చికిత్సను కూడా అందిస్తున్నట్లు స్పష్టం చేశారు.
కంటికి సరోజినీ దేవికి రిఫర్....
టపాకుల పేల్చివేతలో గాయాలు పాలైన బాధితుల్లో కంటి సమస్యలు ఉంటే వెంటనే సరోజినీ దేవి ఆసుపత్రికి రిఫర్ చేయనున్నారు. అయితే కేవలం సర్జరీలు, తీవ్రమైన కంటి సమస్యలున్న పేషెంట్లను మాత్రమే పంపనున్నారు. స్వల్పపాటి కంటి గాయాలు కలిగిన రోగులకు సరోజినీ దేవి ఆసుపత్రి వైద్యుల సమన్వయంతో ట్రీట్మెంట్ అందిస్తామని ఉస్మానియా డాక్టర్లు వివరించారు. ఇదిలా ఉండగా ప్రతీ ఏడాది పటాకులు పేల్చివేతలో ఎంతో మంది గాయాలు పాలు అవుతున్నారు. దీంతో ఈ సారి ఉస్మానియాలో చికిత్సను అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆరోగ్యశాఖ పేర్కొన్నది.
- Tags
- deepavali