- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బర్త్ డే స్పెషల్: సమంత.. సక్సెస్‌ఫుల్ సినిమంత
సమంత లేడీ సూపర్ స్టార్. సౌత్ ఇండస్ట్రీ లో నంబర్ వన్ హీరోయిన్ గా కష్టపడి ఎదిగిన ఒక సాధారణ మధ్యతరగతి అమ్మాయి. మోడలింగ్ ద్వారా కెరీర్ మొదలు పెట్టి సినిమాల్లో పదేళ్ల సక్సెస్ ఫుల్ జర్నీని కంప్లీట్ చేసుకున్న మేటి నటి. పాత్రలో పదిలంగా ఒదిగిపోయి… ఆ పాత్రకు వన్నె తెచ్చే సామ్… వెండితెరపై ప్రేక్షకులను మాయ చేయడమే కాదు.. నిజ జీవితంలోనూ చైతును మాయ చేసి మూడు ముళ్లు వేయించుకుంది. ఏప్రిల్28 న పుట్టినరోజు జరుపుకుంటున్న సమంత… తన కోసం భర్త స్వయంగా బర్త్ డే కేక్ తయారు చేసి పుట్టినరోజు సెలబ్రేట్ చేశాడని సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ మురిసిపోయింది. కేక్ కటింగ్ ఫోటోస్, చై కేక్ తయారు చేస్తున్న వీడియోను షేర్ చేసిన సమంత… తనకు ఈ పుట్టినరోజు చాలా ప్రత్యేకం అని తెలిపింది.
ప్రస్తుతం పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న సమంతా… సినీ జీవిత ప్రయాణాన్ని కూడా ఎంజాయ్ చేస్తుంది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేయడంలో చైతూ, ఫ్యామిలీ సపోర్ట్ చేయడం పై హ్యాపీ గా ఫీల్ అవుతుంది. పైగా పెళ్లి తర్వాత సెలెక్టెడ్ సినిమాలు చేస్తూ… నటనలో ఒక్కో మెట్టు ఎక్కుతూ కెరీర్ లో దూసుకెళ్తోంది. ఆమె సినీ ప్రయాణం కూడా అలాగే ఒక్కో సినిమాకు ఒక్కో మెట్టు ఎక్కుతూ సూపర్ అనిపించుకుంది. ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు చేసి… ఆ పాత్ర పేరు చెప్తే చాలు సమంత రూపం కళ్ల ముందు కదలాడేలా తన నటనతో ప్రేక్షకులను ప్రభావితం చేయగలిగింది. ఒంటి చేత్తో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే సత్తా ఉందని చాటింది.
ఏ మాయ చేసావే….
నాగ చైతన్యకు జంటగా నటించిన ఏ మాయ చేసావే సినిమాలో జెస్సీ గా ఇప్పటికీ గుర్తుండిపోయింది సమంత. చైతూ కంటే రెండేళ్లు పెద్దదైన జెస్సీ పాత్రలో … లుక్స్, గ్లామర్ టచ్, యాక్టింగ్ తో జస్ట్ వావ్ అనిపించింది. క్లాసికల్ మూవీలో విజువల్ ట్రీట్ ఇచ్చింది. ఇప్పటికీ సమంత అంటే తొలుత గుర్తుకు వచ్చేది జెస్సీనే. ఆ క్యారెక్టర్ లో ప్రేక్షకులను అంతగా మాయ చేయగలిగింది. ముఖ్యంగా లవ్ సీన్స్ లో యాక్టింగ్ తో ఆడియన్స్ ను మళ్లీ మళ్లీ థియేటర్లకు రప్పించేలా చేసింది.
ఈగ..
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. నటిగా మరో మెట్టు ఎక్కేలా చేసింది సమంతను. తన ప్రేమికుడిని చంపిన రౌడీ పై కక్ష సాధించే పాత్రలో సినిమాను మొత్తం తన భుజాలపై వేసుకుని నడిపించింది. మరణించిన ప్రేమికుని జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఏడ్చే సన్నివేశాల్లో మెప్పించిన సామ్… చనిపోయిన ప్రేమికుడు ఈగగా మరో జన్మ ఎత్తి తన దగ్గరకు రాగా… తనతో కలిసి విలన్ పై రివేంజ్ తీసుకోవడం … రాజమౌళి ఈగతో మ్యాజిక్ చేయడం సినిమాను సూపర్ హిట్ చేశాయి.
మహానటి..
మహానటి తో కీర్తి సురేష్ నేటి సావిత్రిగా గుర్తుండి పోగా… మహానటి జీవిత కథను పరిచయం చేసే మధురవాణి గా గుర్తుండిపోయింది సమంత. తన కెరీర్ లో మధురవాణి క్యారెక్టర్ సామ్ కు స్పెషల్ కూడా. ఈ క్యారెక్టర్ చేసేందుకు సమంత ఒప్పుకున్నందుకు దర్శకుడు నాగ్ అశ్విన్ స్పెషల్ థాంక్స్ చెప్పాడు. తను చేయడం వల్లే ఈ పాత్ర ఇంత బాగా వచ్చిందని ప్రశంసించాడు.
రంగస్థలం
అప్పటి వరకు చాలా మోడ్రన్ గా కనిపించిన గ్లామర్ గాళ్ సమంత… ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా కనిపించి మెప్పించింది. భాష, యాస పూర్తిగా భిన్నమైన పాత్రలో తనకు తానే డబ్బింగ్ చెప్పుకున్న సమంతా… వెంకట లక్ష్మిగా ఎంత సక్కగున్నవే లచ్చిమి ఎంత సక్కగున్నవే అని సగటు ప్రేక్షకుడు కూడా పాట పాడుకునేలా చేసింది సామ్. రెండు కాళ్ల చినుకువి నువ్వు… గుండె చెర్ల దూకేసినావ్ అంటూ.. యువత గుండెల్లో గూడు కట్టుకుంది. కాగా ఈ సినిమా చైతూతో పెళ్లి తర్వాత వచ్చిన సామ్ తొలి చిత్రం కావడం విశేషం.
యూ టర్న్
యూ టర్న్ సినిమా ద్వారా తొలిసారి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చేసిన సామ్… లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో హిట్ కొట్టగలదని నిరూపించింది. క్రైమ్ జర్నలిస్ట్ గా కనిపించిన సామ్… ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం వల్ల క్రైమ్ జరగడం… అసలు ఎలా క్రైమ్ జరుగుతుందో తెలుసుకునే క్రమం… చోటు చేసుకునే పరిణామాల్లో తన యాక్టింగ్ తో సినిమాకు ప్రాణం పోసింది. సినిమా సక్సెస్ లో ప్రధాన బలంగా విమర్శల ప్రశంసలు అందుకుంది. యూ టర్న్ సినిమాతో సమంతా కెరీర్ టర్నింగ్ పాయింట్ తీసుకోగా… సస్పెన్స్ జోనర్ లో నూటికి నూరు శాతం న్యాయం చేసింది.
మజిలీ…
భర్త నాగ చైతన్యతో పెళ్లి తర్వాత కలిసి చేసిన సమంత తొలి సినిమా ఇది. భర్త మనసుకు తగిలిన ప్రేమ గాయం మాని… తన పై ప్రేమ కురిపించే రోజు తప్పకుండా వస్తుందనే ఆశతో ఎదురు చూసే ఇల్లాలి పాత్రలో సామ్ నటన అద్భుతం. భర్త ఎన్ని తప్పులు చేసినా భరించే భార్యగా…. భర్తను ఒక్క మాట అన్న కూడా ఊరుకోనని తల్లిదండ్రులు, మామతో పాటు సమాజాన్ని హెచ్చరించే సతీమణిగా… భర్త ఒక్కసారి ప్రేమగా పిలుస్తే చాలు అదే అదృష్టం అనుకునే సతిగా తన నటనతో మజిలీ సినిమాకు మార్క్ వేసింది సామ్.
ఓ బేబీ…
ఓ బేబీ… పేరుకు తగినట్లే బేబీ గా కనిపించే సామ్… డెబ్భై ఏళ్ల బామ్మ 24 ఏళ్ల పడుచుగా మారితే ఎలా ఉంటుంది అనే పాత్రలో నటనకు భారీ ప్రశంసలు అందాయి. యువతిగా కనిపిస్తున్న బామ్మ యాటిట్యూడ్ ను సినిమా మొత్తం క్యారీ చేయడం కత్తి మీద సాము కాగా… చాలా చక్కగా షార్ప్ గా నటించింది సామ్. యువతిలా కనిపిస్తున్న అమ్మాయి చేసే పనులు మాత్రం బామ్మలా కనిపించడం… హావభావాలు పలికించడం, తనకు మాత్రమే సాధ్యమైన నటనతో ప్రేక్షకులను కంటతడి పెట్టించడం సామ్ కే సాధ్యమని అనిపించుకుంది.
జాను…
తమిళ సినిమా 96 రీమేక్ గా వచ్చిన సినిమా జాను. తెలుగులో జాను చిత్రం అంతగా విజయవంతం కాలేకపోయినా.. జాను పాత్రలో కనిపించిన సమంత మాత్రం ఆ క్యారెక్టర్ లో జీవించిన విధానానికి మెప్పు పొందింది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా మ్యాజిక్ చేయడంలో సామ్ భేష్ అనిపించగా… క్లైమాక్స్ సీన్ లో కంటతడి పెట్టిన సమంత ప్రేక్షకుడిని ఆ ఫీల్ ను ఫీల్ అయ్యేలా చేసింది.
Tags: Samantha, Akkineni Samantha, Birthday, Naga Chaitanya, Nagarjuna, HBD