- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నీళ్లొచ్చినయ్.. కేసీఆర్ నీళ్లు..
దిశ, న్యూస్‌బ్యూరో:
వాన నీళ్లు.. బాయి నీళ్లు.. కుంట నీళ్లు.. చెరువు నీళ్లు.. బోరు నీళ్లు.. కాలువ నీళ్లు.. తమ పంటలకు వాటర్ సోర్సు గురించి చెప్పడానికి రైతులు ఈ పదాలను ఉపయోగిస్తారు. నిన్న మొన్నటి నుంచి కర్షక లోకంలో సరికొత్త పదం జన పథమవున్నది. ఆ పదమే ‘కేసీఆర్ నీళ్లు’! చేరువలోని వనరులకు, ఆపై పొలాల చెంతకు వస్తున్న, రాబోతున్న జలాలను కేసీఆర్ నీళ్లంటూ పేరు పెడుతున్నారు. చూడబోతే ఆ పేరే స్థిరమయ్యేలా ఎంతో ఆర్థ్రంగా, సాఫల్య ఆపేక్షతో, కృతజ్ఞతా పూర్వకంగానూ తమ గుండెల్లోంచి ఆటోమేటిగ్గా నామకరిస్తున్నారు. కనుచూపు మేరల్లో నీటి జాడలతో వారిలో నమ్మకాలు పరవళ్లు తొక్కుతున్నాయి. జీవితకాల సంబురాలతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులు తాగు, సాగు నీటికి ఉద్దేశించినవి. నల్లా నీరైనా, పొలాల నీళ్లయినా కేసీఆర్ నీళ్లనే పేరు పడే రోజులొస్తున్నాయి. మాజీ గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ కాళేశ్వరం కట్టడాలను చూసి పరవశించిపోయి ఉప్పొంగిన ఆనందంలో సీఎం కే.చంద్రశేఖరరావును ‘కాళేశ్వరరావు!’ అంటూ కీర్తించగా, క్షేత్రంలో ఎవరైతే లాభితులు కానున్నారో, ఆ రైతులేమో కేసీఆర్ నీళ్లు అంటూ సంబోధిస్తున్నారు. ఆ పిలుపులో ఎదో తెలియని అనుభూతి, ఆత్మీయతల టచింగ్ స్పర్శ స్ఫురిస్తున్నది!
కల్లోలిత ప్రాంతం..ఇక జలకళ ఆసాంతం!
సిరిసిల్ల.. 1990 దశకాంతం వరకూ కల్లోలిత ప్రాంతం. నిత్య దుర్భిక్షమైనది. భౌగోళికంగా సముద్రమట్టానికి అత్యంత ఎత్తున ఉన్నది. రకరకాల ఆటుపోట్లు, పోరాటాలు, ఉద్యమాలు, సామాజిక రుగ్మతలకు, అనర్థాలకూ నెలవైనది. అట్లాంటి సిరిసిల్ల నిజంగానే ఇక సిరుల ఖిల్లాగా కళకళలాడబోతున్నది. ప్రధానంగా శ్రీ రాజరాజేశ్వర జలాశయం(మిడ్ మానేరు) ఉజ్వల భవితకు కొండంత అండ కాబోతున్నది. ఎగువ మానేరుకూ మహర్దశపై ఆశలు రేకెత్తిస్తున్నది. మెట్ట ప్రాంతమైన సిద్దిపేట జిల్లా నేలను కూడా కాళేశ్వరం జలాభిషేకం చేయనున్నది. ఇప్పటికీ ఏమని చెబుతుంటారూ? సిద్దిపేట ఏరియాకు కరీంనగర్ ఎల్‌ఎండీ నుంచి డ్రింకింగ్ వాటర్ ఏనాడో తెచ్చిన ఘనత కేసీఆర్‌దేననీ! అంటే, సిద్దిపేట కూడా కరువు సీమ అన్నట్టే కదా! అంతటి డ్రాట్ ఏరియాలైన సిరిసిల్ల, సిద్దిపేట పల్లె సీమల్లో రైతుల స్వచ్ఛమైన నోట కేసీఆర్ నీళ్లు అనే మాట ధ్వనిస్తుండడం విశేషం. రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల బార్డరులో పంపు హౌస్ (ప్యాకేజీ 10) స్థాపించారు. దానిలోని ఒక మోటారు ద్వారా 3 వేల క్యూసెక్కుల నీటిని ప్రయోగాత్మకంగా మొన్న అనంతగిరి ‘అన్నపూర్ణ’ రిజర్వాయరులోకి ఎత్తిపోశారు. ఈ శుభ సందర్భంలోనే ‘కేసీఆర్ నీళ్లు’ అనేది మార్మోగడం మొదలైంది.
మర్మమేమో కానీ, మంచిని చూస్తున్నారు..!
కాళేశ్వరం రీ-డిజైను, ఖర్చు, లాభ నష్టాలు, ఎత్తిపోతలకు విద్యుత్తు, దానికి రాయితీలు, మొత్తంగా ఒక్కో ఎకరాపై అయ్యే వ్యయం, భవిష్యత్తులో తెలంగాణకు మోయలేని భారం.. అంటూ నాణేనికి మరో కోణంలా వెంటాడుతూనే ఉన్నది! మేధావులు, ప్రతిపక్షాలు ఈ విషయంలో ఆధారాలతో సహా ఆరోపణలు చేస్తూనేవున్నారు. రానున్న కాలంలో దాని పరిణామాలు, సాఫల్య వైఫల్యాలు, నిర్వహణ అనుభవాలు ఏ రకంగా ఉంటాయన్న అంశమూ నీడలా ఫాలో అవుతోన్నది. ఆ మాయలూ, మర్మాల మాటేమో కానీ, సగటు రైతు దృష్టి మాత్రం తనకు కనిపిస్తోన్న నీటి సిరులపైనే ప్రసరిస్తున్నది. అక్కడి దాకా వచ్చిన నీళ్లు, మున్ముందు తమ బీడు భూములనూ తడుపుతాయనే విశ్వాసం అన్నదాతల్లో కలుగుతున్నది. ఆ యాంగిల్‌లో మంచినే చూస్తున్నారు. ఎన్నో తరాలుగా నిరాశా నిస్పృహల్లో చిక్కుకుపోయిన వ్యవసాయదారుల్లో కొత్త ఆశలు మొలకెత్తుతున్నాయి.
రైతే..‘రాజు’!
చేను పనుల్లో బిజీగా ఉన్న ఈ రైతు పేరు యాట రాజు. ఊరు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మాచాపూర్. రంగనాయకులసాగర్ ప్రాజెక్టు కట్టకు దగ్గర్లో తనకు 5 ఎకరాలు పొలమున్నది. ఒక బావి, రెండు బోర్లు ప్రస్తుత ఆధారం. ఉన్నంతలో నీటిని జాగ్రత్తగా యూజ్ చేస్తున్నారు. స్ప్రింక్లర్ల సిస్టమ్‌తో డిఫరెంటు పంటలేస్తున్నారు. మిరప, బిర్నీసు వంటివి స్టాండింగ్ క్రాప్స్. నీరు ఎక్కువగా గుంజే వరి జోలికి మాత్రం పోవడంలేదు. ‘రేపో, మాపో రంగనాయకులసాగర్‌కు కేసీఆర్ నీళ్లు (కాళేశ్వరం జలాలు) వస్తాయి. బోరు, బావుల్లో నీళ్లు పుష్కలమైతై. ఇగ వరి గురించి గుడ్క ఆలోచిస్తా..’ అని అంటున్నపుడు..‘రైతే రాజు’ అనే ధీమా ఆయనలో ప్రతిబింబించింది!
కడమ రెండెకరాలూ పారుతై..!
ఈయన పేరు ఎలుసాని దేవయ్య. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ రైతు. ఐదెకరాల పొలమున్నది. ఇప్పటివరకు 3 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ‘కేసీఆర్ నీళ్లు మానేరు చెరువు(ఎగువ మానేరు మధ్య తరహా జలాశయం)దాకా తప్పక వస్తయని నమ్మకం ఏర్పడింది. మా మానేరు నిండితే బోర్లు, బాయిలల్ల నీళ్లు ఫుల్ గా ఉంటయ్.. నా భూమిల కడమ రెండెకరాలకూ నీటి పారుకం గ్యారెంటీ..’ అంటూ ఫ్యూచర్‌పై గట్టి భరోసాతో ఉన్నారు దేవయ్య.
Tags: kaleshwaram projects, siricilla, siddipet, formers happy, kcr water named by formers, irigation source improved. telangana.