- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బొగ్గు కోసం వెళితే బతుకులు బుగ్గి!
దిశ, కరీంనగర్: ఓవర్ బర్డెన్ (ఓబి) తొలగించే కాంట్రాక్టు కంపెనీ ఎక్స్‌ప్లోజివ్స్ వాడడం వెనుక ఆంతర్యం ఏంటీ? సింగరేణి అధికారుల నిర్లక్ష్యం ఉందా? నలుగురి మృత్యువాత తర్వాత తప్పించుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఓసీపీలో జరిగిన బ్లాస్టింగ్ వెనక సింగరేణి అధికార యంత్రాంగం చేస్తున్న తప్పిదాలే కారణమా? అంటే అవుననే అంటున్నాయి కార్మిక సంఘాలు.
నల్ల బంగారాన్ని వెలికితీసే సింగరేణిలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రమాదాల నడుమ బొగ్గు సేకరణ జరుగుతున్న ప్రాంతం కావడంతో సింగరేణి అధికారుల అనుమతి లేని వారు వెళ్లే అవకాశం లేదు. దీంతో లోపల ఏం జరుగుతున్నదో బాహ్య ప్రపంచానికి పొక్కే అవకాశం లేకుండా పోయింది. ఇదే అదనుగా కొంతమంది అధికారులు ప్రాణాలతో చెలగాటమాడే పనులను సైతం ఎక్స్ పర్ట్స్‌కు సంబంధం లేకుండా అప్పజెప్పారని స్పష్టం అవుతోంది. పేలుడు పదార్థాలను వినియోగించే విషయాన్ని సింగరేణి యాజమాన్యానికి సంబంధించిన ప్రతినిధులే పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లో మట్టిని తొలగించే పనిని మాత్రమే కాంట్రాక్టు సంస్థలకు అప్పగించాల్సి ఉంటుంది. కానీ కాంట్రాక్టు కంపెనీలే మందుగుండు అమర్చడం, డిటొనేటర్లకు అనుసంధానం చేసిన తరువాత నిపుణులు సేఫ్టీ షెడ్ వద్దకు చేరుకుని పేల్చివేతలకు పాల్పడుతుంటారని తెలుస్తోంది. అయితే వాస్తవంగా సింగరేణికి సంబంధించిన శాశ్వత ఉద్యోగులే ఎక్స్‌ప్లోజివ్స్‌ను అమర్చడం నుంచి పేల్చడం వరకు పని చేయాల్సి ఉంటుంది. కానీ ఓసీపీల్లో మాత్రం ప్రైవేటు కంపెనీలకు బ్లాస్టింగ్ పనులు అప్పగించడం అనేది విరుద్ధమేనని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. సింగరేణి పర్మినెంట్ ఉద్యోగులు అయితే వీటీసీ ఉండడంతో పాటు ప్రతి ఐదేళ్ల కోసారి వారికి నెల రోజుల పాటు శిక్షణ ఇస్తారు. అలాగే ఇతర విభాగానికి చెందిన వారు బ్లాస్టింగ్ వింగ్‌లోకి బదిలీ అయితే ఛేంజ్ ఆఫ్ జాబ్ ట్రైనింగ్ అని కూడా ఇస్తారు. కానీ కాంట్రాక్టు కంపెనీ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా అక్కడి నిరుపేదలకు ఉపాధి అవకాశాలు చూపిస్తున్నామని చెప్పి ప్రాణాలతో చెలగాటమాడే పనులు అప్పగించడం ఎంతవరకు సమంజసమో అర్థం కాకుండా పోయింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (డీజీఎంఎస్) నిబంధనల ప్రకారం నడుచుకోవడం లేదన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
మోతాదు తగ్గిందా?
ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లో బొగ్గును వెలికి తీసేందుకు పేల్చివేత విధానాన్ని అవలంభిస్తున్న తీరుపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భూమి లోపల ఉన్న బొగ్గు కోసం బ్లాస్టింగ్ విధానాన్ని అవలంబిస్తున్నారు. ఇందుకోసం వాడే మందుగుండు అత్యంత శక్తివంతమైంది అయితేనే వాడాల్సి ఉంటుంది. గుట్టలుగా ఉండే ఓసీపీల్లో బొగ్గును సేకరించాలంటే ఎక్స్‌ప్లోజివ్ సామర్థ్యం ఎక్కువగా ఉండాలని తెలుస్తోంది. అయితే నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలిచ్చి తక్కువ ధరకు లభ్యమయ్యే మందుగుండును సేకరించి బ్లాస్టింగ్‌లకు వినియోగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనివల్లే ఒకటికి రెండు సార్లు ఒకే ప్రాంతంలో మందుగుండుతో పేల్చివేతలు చేయాల్సి వస్తోందని తెలుస్తోంది. మందుగుండును అమరుస్తున్న క్రమంలోనే పేలుళ్లు జరగడం అనేది అరుదైన విషయంగా చెప్తున్నారు. మరీ ఓసీపీ 1లో ఎలా జరిగిందన్నది తేల్చేందుకు నిపుణులను రంగంలోకి దింపాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. డీజీఎంఎస్ నిబంధనలకు విరుద్ధంగానే సింగరేణి యాజమాన్యం కానీ, కాంట్రాక్టు కంపెనీ కానీ వ్యవహరించిందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. బ్లాస్టింగ్ తరువాత పేలకుండా మిగిలిన పేలుడు పదార్థాలను నాశనం చేయాల్సి ఉన్నప్పటికీ ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నది అంతుచిక్కకుండా ఉంది.
నెపం సెల్‌ఫోన్‌పై..
సెల్‌ఫోన్ వినియోగం వల్లే మంగళవారం ఓసీపీ-1లో బ్లాస్టింగ్ జరిగిందన్న సంకేతాలను పంపించే పనిలో నిమగ్నం అయ్యారు. మందుగుండును గుంతల్లో నింపుతున్న క్రమంలో అక్కడ పనిచేస్తున్న వారు సెల్‌ఫోన్ వాడడం వల్ల మిస్ ఫైర్ అయిందన్న సాకుతో తప్పుదారి పట్టించే ప్రయత్నాలు సాగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నిష్ణాతులతో చేయించాలి: కెంగెర్ల మల్లయ్య, బీఎంఎస్ అధ్యక్షుడు
సింగరేణిలో శాశ్వత ఉద్యోగులతో చేయించాల్సిన పనులు కాంట్రాక్టు సంస్థలకు అప్పగించడం నిబంధనలకు విరుద్ధమే. శిక్షణ లేని వారిచే ఎక్స్ ప్లోజివ్స్ అమర్చడం సరైంది కాదు. సింగరేణి యాజమాన్యం పూర్తి స్థాయిలో బాధ్యత వహించాల్సిందే. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే డీజీఎంఎస్ ఆదేశాలను విధిగా అమలు పర్చాల్చిందే.