వైజాగ్‌తో పాటు ఏపీని బెంబేలెత్తిస్తున్న చికెన్ షాప్ ఓనర్

by srinivas |
వైజాగ్‌తో పాటు ఏపీని బెంబేలెత్తిస్తున్న చికెన్ షాప్ ఓనర్
X

ఆంధ్రప్రదేశ్ ఎగ్జీక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్టణాన్ని కరోనా ఆరంభం నుంచి భయపెడుతున్న సంగతి తెలిసిందే. వైజాగ్‌లోని అల్లిపురంకి చెందిన వ్యక్తి హజ్ యాత్రకు వెళ్లి వచ్చి కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వైజాగ్‌లో అడపాదడపా కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అయితే విదేశాల నుంచి వచ్చినవారికే కరోనా సోకిన కేసులు నమోదు కావడంతో అంతా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు వైజాగ్‌లోని గాజువాకలో చోటుచేసుకున్న ఘటన రాష్ట్ర ప్రజలందర్నీ భయపెడుతోంది.

వైజాగ్‌లోని గాజువాక కుంచుమాంబ కాలనీలో చికెన్ షాప్ యజమానికి కరోనా పోజిటివ్ కేసు బయటపడింది. ఆ వ్యక్తి ఢిల్లీలోని నిజాముద్దీన్‌లోని తబ్లిఘీ జమాత్ మర్కజ్‌కి హాజరై వచ్చాడు. వచ్చిన నాటి నుంచి షాప్‌లో చికెన్ క్రయవిక్రయాలు ఆయనే చూస్తున్నాడు. ఆయన షాప్‌లో భారీ సంఖ్యలో చికెన్ కోనుగోలు చేశారు. ఈ క్రమంలో ఆయన అనారోగ్యానికి గురయ్యాడు. ఆయనకు వైద్య పరీక్షలు చేయగా, కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ పరిసరాల్లోని ప్రజలంతో భయంతో బిగుసుకుపోతున్నారు.

ఈ ఘటనతో ఆంధ్రప్రదేశ్‌లో ఆయన కారణంగా తొలిసారి వైజాగ్‌లో కరోనా సోషల్ ట్రాన్స్‌మిషన్ జరిగిందన్నా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు ఆయన దగ్గర చికెన్ కొనుగోలు చేసిన వారు స్వచ్ఛందంగా వచ్చి అధికారుల వద్ద పేర్లు నమోదు చేసుకున్నారు. ఆ ఏరియా మొత్తాన్ని అధికారులు ఆధీనంలోకి తీసుకుని నిఘా ఉంచారు. అక్కడ కఠిన ఆంక్షలు అమలులో ఉన్నాయి. ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి కరోనా కేసు నమోదు కాలేదు. కానీ భయాలు మాత్రం నెలకొన్నాయి.

కాగా, కరోనా బాధితుడు గత నెల శ్రీకాళహస్తి నుండి గాజువాక వచ్చి, రాజీవనగర్ మసీదు మరో 8 మందితో కలసి 15 రోజులున్నట్టు తెలిపాడు. అలాగే పరవాడ మసీదులో మరో 8 మందితో కలిసి ఉన్నట్టు వెల్లడించాడు. దీంతో వారందర్నీ వైజాగ్‌లోని ఛెస్ట్ ఆసుపత్రికి తరలించి క్వారంటైన్‌లో ఉంచారు. వారి కుటుంబ సభ్యులను సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాలని హెచ్చరించారు. ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలతో గాజువాకలో మరిన్ని కరోనా కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందన్న ఊహాగానాలు రేగుతున్నాయి.

ఏపీలో వైజాగ్ కీలకమైన ప్రాంతం. వైజాగ్‌లో గాజువాక మరింత కీలక ప్రాంతం. గాజువాకకు దగ్గర్లోనే నావల్ డాక్ యార్డ్, హిందుస్థాన్ షిప్ యార్డ్, హెచ్‌పీసీఎల్, జింక్ లిమిటెడ్, బీహెచ్‌పీవీ వంటి జాతీయ సంస్థలున్నాయి. అలాగే వైజాగ్‌లో కేంద్రీకృతమైన పారిశ్రామిక వాడ, ఫార్మారంగం కూడా ఆ పరిసరాల్లోనే ఉంది. దీంతో ఇక్కడ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారంతా నివసిస్తుంటారు. వారితో పాటు గాజువాక స్థానికులు కూడా నివాసం ఉంటారు.

వారిలో ఎవరికి సోకినా అక్కడ వేగంగా సోషల్ ట్రాన్స్ మిషన్ జరిగే ప్రమాదం ఉంది. ఈ జాతీయ సంస్థల్లో ఎవరికి సోకినా వారి నుంచి వందలాది మందికి సోకే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఈ పరిసరాల్లో అధికారులు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఏపీ వైద్యఆరోగ్యశాఖాధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

Tags: visakhapatanam, gajuwaka, kunchumamba coloney, rajeevnagar, corona positive, chicken shop owner

Advertisement

Next Story