- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కరోనా బాధితులకు స్పెషల్ ఐసోలేషన్ సెంటర్లు
దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్పరిధిలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారుల్లో కదలిక కనిపిస్తోంది. కరోనా కట్టడి, లాక్‌డౌన్, పాజిటివ్ కేసులకు సేవలు వంటి అంశాలపై మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్సెక్రటరీ అర్వింద్కుమార్బుధవారం వీడియో కాన్ఫరెన్స్నిర్వహించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఐసోలేషన్సెంటర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
గ్రేటర్ పరిధిలోని ఫంక్లన్హాల్స్, ప్రభుత్వ పాఠశాలల డేటాను అధికారులు సేకరిస్తున్నారు. ఇండ్లలో ఐసోలేషన్ఉండేందుకు అవకాశం లేని పేదల కోసం వీటిని ఉపయోగించాలని అధికారులు ఆలోచిస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించాయి. దీంతో వచ్చే నెలలో తెలంగాణలో కూడా లాక్ డౌన్ విధిస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. నగరంలోనూ రాత్రి పూట కర్ఫ్యూ స్థానంలో పూర్తిగా లాక్‌డౌన్ విధించే పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు లాక్డౌన్చర్యలను చేపడుతున్నారు.
కరోనా కట్టడి కోసం కర్ఫ్యూ విధించినప్పటికీ అనుకున్న ఫలితాలు రాకపోవడంతో ప్రభుత్వం దశల వారీగా లాక్‌డౌన్ విధించే దిశగా ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా గ్రేటర్ పరిధిలోని నిరాశ్రయులు, బిచ్చగాళ్లను నైట్ షెల్టర్లకు తరలించే ప్రక్రియను జీహెచ్ఎంసీ చేపట్టింది. గ్రేటర్‌లో లాక్‌డౌన్ విధించేందుకు ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా సిద్ధంగా ఉండేలా జీహెచ్ఎంసీ ముందస్తు చర్యలు తీసుకుంటోంది. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ తో పాటు జోనల్ కమిషనర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.