ఆ ప్లేస్‌లో హీరోయిన్ ఫేస్ టాటూ వేయించుకున్న ఫ్యాన్

by Shyam |   ( Updated:2023-08-22 04:53:18.0  )
ఆ ప్లేస్‌లో హీరోయిన్ ఫేస్ టాటూ వేయించుకున్న ఫ్యాన్
X

దిశ, సినిమా : బ్యూటిఫుల్ నోరా ఫతేహికి అనుకోని సంఘటన ఎదురైంది. ఓ వీరాభిమాని తనకిచ్చిన సర్‌ప్రైజ్‌కు ఎలా రియాక్ట్ కావాలో కూడా తెలియని పొజిషన్‌లో ఉండిపోయింది. మూవీ షూటింగ్ కోసం ముంబైకి చేరుకున్న నోరాకు వీడియో జర్నలిస్టులతో పాటు ఓ స్పెషల్ ఫ్యాన్ గ్రీట్ చేశాడు. అంతేకాదు దగ్గరగా వెళ్లి నోరా ఫేస్‌ను తన చేయి మీద ఎలా టాటూ వేయించుకున్నాడో చూపించాడు. తనను కలిసేందుకే ఔరంగాబాద్ నుంచి ఇంత దూరం వచ్చానని చెప్పాడు. అంతటితో ఆగకుండా తనతో కేక్ కూడా కట్ చేయించి, ఈ స్పెషల్ మూమెంట్‌ను సెలబ్రేట్ చేసుకున్నాడు స్పెషల్ ఫ్యాన్. దీంతో ఎమోషనల్ అయిపోయిన ఈ బ్యూటిఫుల్ హీరోయిన్‌కు ఎలా స్పందించాలో కూడా తెలియలేదు. చాలా కష్టాలు ఎదుర్కొని ఇండస్ట్రీకి వచ్చిన తనపై ఇంతగా అభిమానాన్ని చూపించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపింది.

Advertisement

Next Story