- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోవిడ్-19 కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్
దిశ, న్యూస్ బ్యూరో: కరోనా నివారించాలంటే ఏ ఒక్కరి వల్లనో సాధ్యమయ్యే పరిస్థితి లేదు. ప్రజలంతా ఒకే కట్టుబాటుతో జాగ్రతగా వ్యవహరించినప్పుడే అది సాధ్యమవుతుంది. ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించినా.. ప్రజలు రోడ్ల మీదకు రావడం ఆపడం లేదు. అత్యవసర సేవలను మినహాయించడంతో ఏదో ఒక కారణం చెప్పి రోడ్ల మీద తిరిగేవారి సంఖ్య పెరిగిపోతోంది. వారం రోజులైనా రోడ్లపై వాహనాలు, ప్రజలు కనిపిస్తున్నారంటే ఎంత ఆషామాషీగా తీసుకుంటున్నారో అర్థమవుతోంది. ప్రభుత్వ నేతలు, వివిధ శాఖల అధికారులు, పోలీసులు, వైద్యులు పడుతున్నా కష్టానికి విలువ లేకుండా పోతోంది. కూరగాయలకనో, రేషన్ సరుకులనో, మెడికల్ అత్యవసరమనో రోడ్ల మీదకు వస్తున్నారు జనాలు. అందరినీ అడిగి నిర్ధారించుకోవడం కూడా పోలీసులకు తలకు మించిన భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలకు అవసరమైన వివిధ రకాల సేవల కోసం ‘‘కోవిడ్ -19 ప్రత్యేక కంట్రోల్ రూం’’, నెంబర్లను కేటాయించారు. ప్రజలు ఆయా నెంబర్లను సంప్రదించి ద్వారా ఇంట్లోనే ఉండి కావాల్సిన సమాచారం తెలుసుకోవచ్చు.
కోవిడ్-19 ప్రత్యేక కంట్రోల్ రూమ్ వివరాలు:
విభాగం కాంటాక్ట్ నెంబర్
సెక్రటేరియట్ 040-23450624/735
జీహెచ్ఎంసీ 9154686557/58/49
ఆహారం 9154170990/991
రేషన్ 9948682495
పోలీస్ హెల్ప్‌లైన్ 9010203626/100
వసతి, ఆహారం 9702385140/38
హైదరాబాద్ కలెక్టరేట్ 040-23202813
Tags: Special control room, Covid-19, hyderabad