- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పశు వైద్యం కోసం ప్రత్యేక అంబులెన్స్.. ఆ నెంబర్‌కు కాల్ చేస్తే క్షణాల్లో..
దిశ, కొత్తగూడ: పశు సంరక్షణకై పశు వైద్య సంచార వాహనాన్ని కొత్తగూడ, గంగారం మండలాల పరిధిలో సేవలు అందించడం కోసం ప్రారంభించారు. ఇరు ఏజెన్సీ మండలాల్లోని పలు గ్రామాల్లో పశువులకు వ్యాధులు సంక్రమిస్తే, అందుబాటులో సరైన వైద్యం అందక ఎక్కువ సంఖ్యలో మృత్యువాత పడేవి. ఈ సంచార పశు వైద్య అంబులెన్స్ రాకతో ఆ కష్టాలు తీరనున్నాయి. 1962 నెంబర్కి కాల్ చేస్తే సంచార పశు వైద్య అంబులెన్స్ మీ వాకిట్లోకి వచ్చి వైద్యం అందిస్తుంది. రైతులకు సంచార పశువైద్యం వల్ల ఎంతో మేలు కలగనుంది. ఒక్క ఫోన్ కాల్తో సరిగ్గా మంద వద్దకు అంబులెన్స్ వెళ్లి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించనుంది. గ్రామాల నుంచి పశువులను తీసుకుని వైద్యశాలకు వెళ్లలేని వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.1962 వాహనంలో అన్ని రకాల జంతువులకు ఉచితంగా సేవలు అందజేస్తారు. ఈ వాహనంలో డాక్టర్, వెటర్నరీ అసిస్టెంట్, కెప్టెన్, అటెండర్ అందుబాటులో ఉంటారు. ఈ కార్యక్రమంలో నెహ్రు నాయక్, శరణ్య, పాలడుగుల రవి తదితరులు పాల్గొన్నారు.