ఆయన మౌనాన్ని వీడితే ప్రళయమే…

by srinivas |
ఆయన మౌనాన్ని వీడితే ప్రళయమే…
X

దిశ, వెబ్ డెస్క్:
టీడీపీపై స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర విమర్శలు చేశారు. అమరావతిలో టీడీపీ నాయకులు బాగా మెక్కేశారని ఆయన అన్నారు. అమరావతి విషయంలో సీబీఐ విచారణకు టీడీపీ నేతలు భయపడుతున్నారని ఆయన అన్నారు. అందుకే చంద్రబాబు స్టేలు తెచ్చుకుంటున్నారని ఆయన చెప్పారు. చంద్రబాబును ఎప్పుడు లోపల వేస్తారో తెలియదని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని పరిస్థితులపై జగన్ మౌనంగా ఉంటున్నారనీ తెలిపారు. జగన్ మౌనాన్ని వీడినప్పుడు ప్రళయం వస్తుందని ఆయన తెలిపారు. అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని టీడీపీని హెచ్చరించారు.

Advertisement

Next Story