ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన స్పీకర్ తమ్మినేని దంపతులు

by srinivas |
ap assembly speaker tammineni sitaram
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారినపడ్డారు. అయితే, అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులు ఇటీవల కరోనా బారినపడిన విషయం తెలిసిందే. చికిత్స అనంతరం ఆరోగ్యం కుదుటపడటంతో వీరిద్దరూ ఈరోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భం గా తమ్మినేని మాట్లాడుతూ.. వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో కరోనా రోగులకు అందిస్తున్న వైద్యంపై ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. కరోనా కష్టకాలంలో రాజకీయాలు చేయడం సరికాదని తమ్మినేని అన్నారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స తీసుకుంటున్న వారికి మంచి చికిత్సను అందిస్తున్నారని కొనియాడారు.

Advertisement

Next Story