- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మనుషులపై స్పేస్ రేడియేషన్ ప్రభావం?
దిశ, ఫీచర్స్: భూ వాతావరణం నాలుగైదు పొరలతో కప్పబడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనుషులపై స్పేస్ రేడియేషన్ ప్రభావం ఉండదు. కానీ ఈ అట్మాస్పియర్ నుంచి బయటికి వెళ్లినప్పుడు పరిస్థితి ఏంటనే అంశంపై శాస్త్రవేత్తలు పలు విషయాలు వెల్లడించారు. ప్రపంచదేశాలు అంతరిక్ష ప్రయాణాలు ప్రారంభించడంతో పాటు చంద్రుడు, మార్స్‌పై కాలనీల ఏర్పాటుకు ఆలోచనలు చేస్తున్నారు. ఈ క్రమంలో అంతరిక్షంలో వెలువడే రేడియేషన్ నుంచి రక్షణ పొందడం అత్యంత కీలకాంశాల్లో ఒకటి. ఇంతకీ స్పేస్ రేడియేషన్ అంటే ఏమిటి? అది మానవ శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే విషయాలు పరిశీలిస్తే..
స్పేస్ రేడియేషన్..
స్పేస్ రేడియేషన్ అనేది ప్రాథమికంగా అధిక శక్తి గల ప్రోటాన్లు, భారీ అయాన్లతో కూడిన ప్రవాహం. అయస్కాంత క్షేత్రాల ప్రభావం కారణంగా అణువులు అధిక వేగంతో ప్రయాణించినపుడు అందులోని ఎలక్ట్రాన్లు తొలగించబడతాయి. అప్పుడు అధిక శక్తిగల ప్రోటాన్లు మిగిలిపోతాయి. వీటితో పాటు సౌర వ్యవస్థ వెలుపలి నుంచి వచ్చే శక్తివంతమైన కణాలు ‘గెలాక్సీ కాస్మిక్ కిరణాలు’(జీసీఆర్) కూడా ఉంటాయి. జీసీఆర్ అనేది కొన్ని మిలియన్ సంవత్సరాల పాటు సూపర్నోవా అవశేషాల అయస్కాంత క్షేత్రాల ద్వారా వేగవంతం చేయబడిన కక్ష్యల్లో ప్రయాణించే కేంద్రకాల సంచితం.
ఎవరికి ముప్పు?
రేడియేషన్‌లో.. పరమాణువు సైజు ఫిరంగి గుండులా ప్రవర్తించే కణాలు ఉంటాయి. అవి ఏ పదార్థాల గుండా ప్రయాణిస్తే వాటిని మార్చేస్తాయి. దీర్ఘకాలికంగా రేడియేషన్‌కు గురయ్యే వ్యోమగాముల ఆరోగ్యంపై ఇది ప్రభావాన్ని చూపుతుంది. రేడియేషన్‌ను మిల్లీ-సీవర్ట్ (mSV)తో కొలుస్తారు. కాగా అంతరిక్షంలో ఉండే వ్యోమగాములు 50-2,000 mSV మధ్యన రేడియేషన్‌కు ఎక్స్‌పోజ్ అవుతుంటారు. నిజానికి 1mSV రేడియేషన్ మూడు చెస్ట్ ఎక్స్‌రేలకు సమానం. ఈ లెక్కన వ్యోమగాములు 150-6000 చెస్ట్ ఎక్స్‌రేలను ఎదుర్కొనే అవకాశం ఉంది.
ఎటువంటి అనారోగ్యాలకు దారితీస్తుంది?
రేడియేషన్ల వల్ల DNA తంతువులు విచ్ఛిన్నమై దెబ్బతింటాయి. ఆ కణాలను రిపేర్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మ్యుటేషన్‌కు గురవుతాయి, అది క్యాన్సర్‌కు దారితీస్తుంది. ఇంకా గుండె, ధమనులు లేదా రక్త నాళాలలోని కణాల లైనింగ్‌లను దెబ్బతీయడం ద్వారా హృదయనాళ వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తాయి. ఇతర వ్యాధులలో కేంద్ర నాడీ వ్యవస్థను దెబ్బతీయడంతో పాటు బోలు ఎముకల వ్యాధి, అల్జీమర్స్, ఆస్టియో ఆర్థరైటిస్ వంటి వ్యాధులకూ అవకాశం ఉంది.