సింగరేణికి థ్యాంక్స్.. కొత్తగూడెంలో DSP కార్యాలయం ప్రారంభం : SP సునీల్ దత్

by Sridhar Babu |
సింగరేణికి థ్యాంక్స్.. కొత్తగూడెంలో DSP కార్యాలయం ప్రారంభం : SP సునీల్ దత్
X

దిశ, కొత్తగూడెం : శిథిలావస్థకు చేరుకున్న కొత్తగూడెం డీఎస్పీ కార్యాలయాన్ని సింగరేణి సంస్థ సహకారంతో పునర్నిర్మాణం చేపట్టారు. నూతన హంగులతో నిర్మితమైన కార్యాలయాన్ని కొత్తగూడెం డీఎస్పీ జి.వెంకటేశ్వరబాబు ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ సునీల్ దత్ చేతుల మీదుగా బుధవారం ప్రారంభోత్సం చేశారు. ముందుగా ఎస్పీ సునీల్ దత్‌కు కొత్తగూడెం డీఎస్పీ వెంకశ్వరబాబు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఆ తర్వాత డీఎస్పీ కార్యాలయ పునర్నిర్మాణం శిలాఫలకాన్ని ఎస్పీ ఆవిష్కరించారు. తదుపరి డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విందులో అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. డీఎస్పీ కార్యాలయ పునర్నిర్మాణానికి సహాయ సహకారం అందించిన సింగరేణి యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు.

నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ పరిపాలనా సౌలభ్యాన్ని పెంచుకునేందుకు పాత భవవాన్ని నూతన హంగులతో ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామమన్నారు. ఇకపై సబ్ డివిజన్లలోని అధికారులకు, ప్రజలకు ఈ కార్యాలయం అందుబాటులో ఉంటుందని కొత్తగూడెం డీఎస్పీ వెంకటేశ్వర బాబు తెలిపారు. కార్యక్రమంలో ఓఎస్డీ వి.తిరుపతి, ఏఆర్ అడిషనల్ ఎస్పీ డి.శ్రీనివాసరావు, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కేఆర్‌కే ప్రసాద్, పాల్వంచ ఏఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్, డీఎస్పీలు రవి, ఆదినారాయణ, ఎస్బీ సీఐ బాలాజీ, 3 టౌన్ సీఐ వేణుచందర్, చుంచుపల్లి సీఐ గురుస్వామి, 2 టౌన్ సీఐ ఎల్.రాజు, 1టౌన్ సీఐ బి.సత్యనారాయణ, జూలూరుపాడు సీఐ ఎం.నాగరాజు, ఆర్ఐలు సోములు, కామరాజు, దామోదర్, సుధాకర్, నాగేశ్వరరావు, సింగరేణి జీఎం లు రమేష్ రెడ్డి, కుమార్ రెడ్డి, దామోదర్, రాజీవ్ కుమార్, ధన్ పాల్ శ్రీనివాస్ మరియు కొత్తగూడెం సబ్ డివిజన్లలోని ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed