అన్ని తరాల మ్యూజిక్ డైరక్టర్లతో..

by Shyam |
అన్ని తరాల మ్యూజిక్ డైరక్టర్లతో..
X

దిశ, వెబ్‌డెస్క్ :

ఎస్పీ బాలు గాత్రం నెమ్మదిగా అందరికీ నచ్చడం మొదలయ్యాక ఆయన పాట లేకుండా సినిమా ఉండేది కాదంటే అతిశయోక్తి కాదు. స్వర్ణయుగంగా పేర్కొనే సంగీత దర్శకుల సారథ్యంలో పాటలు పాడే అవకాశం బాలసుబ్రహ్మణ్యం దక్కించుకున్నారు. 1969 నుంచే బాలు బాగా బిజీ అయ్యారు. బాలు స్వరంలో వచ్చిన పాటలు యువతను విశేషంగా ఆకట్టుకోవడం మొదలు పెట్టాయి.

పెండ్యాల, సత్యం, తాతినేని చలపతిరావు, మాస్టర్‌ వేణు, ఆదినారాయణ రావు, టి.వి.రాజు, యం.యస్‌.విశ్వనాథన్, ఇళయరాజా, జి.కె.వెంకటేష్, రమేష్‌ నాయుడు, అశ్వత్థామ, చక్రవర్తి, రాజ్‌-కోటి, రాజన్‌-నాగేంద్ర, కీరవాణి వంటి సంగీత దర్శకుల వద్ద బాలు కొన్ని వేల మరపురాని మధురమైన పాటలు పాడారు. ఇక అన్ని తరాల కథానాయకులకు ఎస్పీబీ పాటలు పాడారు. ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, కృష్ణ, శోభన్‌బాబు, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్‌ సహా ఈతరంలోని అగ్ర హీరోలందరికీ ఆయన పాటలు పాడటం విశేషం.

Advertisement

Next Story

Most Viewed