- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కోలుకుంటున్న ఎస్పీ బాలు..
దిశ, వెబ్‌డెస్క్: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై అప్‌డేట్ ఇచ్చారు తనయుడు ఎస్పీ చరణ్. ప్రస్తుతం బాలు ట్రీట్మెంట్‌కు స్పందిస్తున్నారని.. వైద్యులు మాట్లాడుతున్న దానికి సంజ్ఞల ద్వారా రిప్లయ్ ఇస్తున్నారని చెప్పాడు. కుటుంబం, అభిమానుల ప్రార్థనలు.. దేవుని దయతో నాన్నగారి పరిస్థితి మెరుగవుతుండటం పట్ల చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. బాలు ఆరోగ్యం విషయంలో స్పెషల్ కేర్ తీసుకున్న ఎంజీఎం ఆస్పత్రి వైద్యులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. నాన్న త్వరలో రికవరీ అవుతారని ధీమా వ్యక్తం చేసిన ఎస్పీ చరణ్.. మీ ప్రార్థనలు ఇలాగే కొనసాగితే నాన్న పూర్తి ఆరోగ్యంతో ఇంటికి తిరిగొస్తారని అన్నారు.
#Spb health update 25/8/20 pic.twitter.com/pX1HXqcd2O
— S. P. Charan (@charanproducer) August 25, 2020
కాగా, ఎస్పీ బాలుకు కరోనా నెగెటివ్ అని సోషల్ మీడియాలో ప్రచారం జరగగా.. అదంతా ఫేక్ న్యూస్ అని క్లారిటీనిచ్చారు చరణ్. ఇక ఎస్పీ బాలుకు దేశవ్యాప్తంగా అభిమానులున్నారని.. అందుకే ప్రాంతీయ భాషలో కాకుండా అందరికీ అర్థమయ్యేలా ఇంగ్లీష్‌లోనే నాన్నగారి హెల్త్ అప్‌డేట్ ఇస్తున్నట్లు చెప్పారు.