విషమంగా ఎస్పీ ఆరోగ్య పరిస్థితి!

by Anukaran |
విషమంగా ఎస్పీ ఆరోగ్య పరిస్థితి!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ సింగర్ ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారని సమాచారం. ప్రస్తుతం బాలుకు ఎక్మో సపోర్ట్ తో ఐసీయూలో చికిత్స కొనసాగిస్తున్నారు. బాలు కీలక అవయవాల పనితీరును నిశితంగా డాక్టర్లు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. చికిత్సకు బాలు స్పందిస్తున్నారని వారు పేర్కొన్నారని తెలిసింది.

కాగా, బాలు త్వరగా కోలుకోవాలని దక్షిణాది, ఉత్తరాది సినీ పరిశ్రమ ప్రార్థనలు వేడుకుంటున్నాయి. ఆగస్టు 5న కరోనాతో ఆయన ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story