- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోవిడ్-19ని అరికట్టే దిశలో నిత్యావసర సరుకుల రవాణా రైళ్ల నిర్వహణలో దక్షిణ మధ్య రైల్వే మరిన్ని చర్యలు తీసుకుంది. రవాణా వినియోగదారులకు డెమరేజ్, వార్‌ఫేజ్ చార్జీల మాఫీతో పాటు మరికొన్ని రాయితీలు కల్పించింది. భారతీయ రైల్వే నిర్ణయానికి అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే గూడ్స్, పార్సల్‌లో సరుకు రవాణా చేయడానికి మార్చి 22 నుంచి ఏప్రిల్ 14 వరకు డెమరేజ్, వార్‌ఫేజ్ ఛార్జీలు విధించకూడదని నిర్ణయం తీసుకుంది. భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ కోవిడ్-19 ఒక జాతియ విపత్తుగా భావించి ఈ నిర్ణయం చేసింది. ఇంతకు ముందు 50 శాతం టారిఫ్‌నే విధించాలన్న నిర్ణయానికి ఇది సవరింపు అవుతుంది. కంటైనర్ టారీఫ్‌లో కూడా స్టేకింగ్, డిటెన్షన్, గౌండ్ యూసేజ్ చార్జీలుండవుని స్పష్టం చేసింది.
ఈ రవాణలో ముఖ్యంగా -థర్మల్ పవర్ ప్లాంట్లకు విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం బొగ్గును, వ్యవసాయ రంగానికి ఎరువులు, ప్రజోపయోగానికి ఆహారధాన్యాలు, రేణిగుంట నుంచి ఢిల్లీకి పాలు సరఫరా చేస్తున్నారు. ఈ విషయంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం కలిగి ఉండి అవసరమైన వారి అవసరాల కనుగుణంగా చేర్చడానికి గూడ్స్ రైళ్లను సాఫీగా నడిపేందుకు చర్యలు తీసుకున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు ముఖ ద్వారమైన దక్షిణ మధ్య రైల్వే ఇతర జోన్‌ల నుంచి వచ్చే రవాణా రైళ్లను ఇంటర్ చేంజ్ ఆపరేషన్ల ద్వారా సగటున రోజుకి 160 రైళ్ల చొప్పున మొత్తం 961 రవాణా రైళ్లను నడుపుతున్నట్లు ఓ ఉత్తర్వుల్లో వెల్లడించారు.