- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
T20 ప్రపంచకప్: సఫారీల చేతిలో బంగ్లా చిత్తు
దిశ, వెబ్‌డెస్క్: T20 ప్రపంచకప్‌లో భాగంగా దుబాయ్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా-బంగ్లాదేశ్ జట్లు తలపడ్డాయి. తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో సఫారీలు బంగ్లా జట్టుని చిత్తుగా ఓడించి, సెమీస్ బరిలో ముందంజ వేశారు. మొదట టాస్ గెలిచి బౌలింగ్ చేసిన సఫారీలు.. బంగ్లా జట్టు వెన్ను విరిచారు. టాప్ ఆర్డర్ నుంచి లోయర్ ఆర్డర్ వరకు ప్రత్యర్థికి చుక్కలు చూపించారు. దీంతో బంగ్లాదేశ్ 18.2 ఓవర్లలో కేవలం 84 పరుగులకే ఆలౌట్ అయింది. సఫారీ బౌలర్లల్లో రబాడ, నోర్ట్జే తలో 3 వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాసించారు. 85 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ జట్టు మొదట్లో కాస్త తడబడ్డా, కెప్టెన్ బావుమా (31) తో అజేయంగా నిలబడడంతో కేవలం 13.3 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి.. 6 వికెట్ల తేడాతో లక్ష్యాన్ని ఛేదించింది. ఇక ఈ విజయంతో సఫారీ జట్టు సెమీస్ రేస్‌లో ముందంజ వేయగా, ఆడిన నాలుగు మ్యాచుల్లో ఓడిన బంగ్లా ఇంటిదారి పట్టనుంది.