- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జులై నుంచి ఆ దేశం కూడా మాస్క్ ఫ్రీ
దిశ, వెబ్‌డెస్క్: కరోనా కాలంలో ప్రతిఒక్కరూ మాస్క్ ధరించడం అనేది తప్పనిసరి. కానీ మాస్క్ లేకుండా స్వేచ్ఛగా తిరిగే రోజుల కోసం ప్రతిఒక్కరూ ఎదురుచూస్తున్నారు. మాస్క్ పెట్టుకోకుండా రోడ్లపై తిరిగే రోజులు వస్తే బాగుండని ప్రతిఒక్కరూ కలలు కంటున్నారు. కొన్ని దేశాల్లో ఆ పరిస్థితులు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. వ్యాక్సిన్ ప్రక్రియను పూర్తిచేసిన కొన్ని దేశాలు.. మాస్క్ ఫ్రీ దేశంగా ప్రకటించుకున్నాయి. కరోనా పరిస్థితుల్లో తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, లేకపోతే ఫైన్ వేస్తామని చెప్పిన దేశాలు.. ఇప్పుడు మాస్క్ లేకుండా బయట తిరగవచ్చని చెబుతున్నాయి.
వ్యాక్సిన్ రెండు డోస్‌లు వేయించుకున్నవారు మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఇటీవల అమెరికా ప్రకటించగా.. తాజాగా మరో దేశం కూడా అదే బాటలో నడిచింది. వ్యాక్సిన్ ఒక్క డోస్ వేయించుకున్నవారు జులై నుంచి మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని దక్షిణాఫ్రికా తాజాగా ప్రకటించింది. ఇంకా చాలా దేశాలు వీలైనంత త్వరగా వ్యాక్సిన్ ప్రక్రియను పూర్తిసి మాస్క్‌కు బైబై చెప్పాలని చూస్తున్నాయి.